
Guvvala Balaraju: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో బీఆర్ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన యంగ్ లీడర్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు . అంతేకాకుండా తనని తాను కేసీఆర్ వదిలిన బాణం అని ప్రకటించుకునే వారు. ఇటీవల తనపై పలు ఆరోపణలు, సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో గువ్వల బాలరాజ్ బీఆర్ఎస్ పార్టీని వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజీనామా అనంతరం గువ్వల బాలరాజ్ ఏ పార్టీలో చేరబోతున్నారనే చర్చ సాగింది. ఈ నేపథ్యంలో అటు బీఆర్ ఎస్, ఇటు అధికార కాంగ్రెస్ కు షాక్ తగిలేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
ఈ ఉత్కంఠ ఘట్టానికి త్వరలోనే ఎండ్ కార్డ్ వేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. తాజాగా గువ్వల బాలరాజు బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యర్థి బీజేపీలోకి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా గువ్వల బాల రాజు శుక్రవారం ఉదయం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావుతో భేటీ అయ్యారు. అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. సన్నిహితులు అనుచరులతో చర్చించిన తర్వాత కమలం కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు బాలరాజు తెలిపారు. ఆయన, తన అనుచరులతో కలిసి ఆగస్టు 11న ఆయన బీజేపీ తీర్థం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే ప్రచారం జరుగుతున్న వేళ పార్టీ వైపు కొందరు బీఆర్‌ఎస్‌నేతలు చూస్తున్నట్టు తెలుస్తోంది.
బాలరాజు గతంలో బీఆర్‌ఎస్‌లో ఉండి, రెండు సార్లు అచ్చంపేట నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత అచ్చంపేట నియోజకవర్గంలో అనుచరులతో సమావేశమయ్యారు. ఎందుకు గులాబీ పార్టీకి రాజీనామా చేశారో వారికి వివరించారు. గత కొంతకాలంగా బీఆర్‌ఎస్‌లో తాను అవమానాలు ఎదుర్కొన్నట్టు తెలిపారు. బడుగు బలహీన వర్గాలు ఏ పదవుల్లో ఉన్నా సరే వారికి బానిసలుగానే ఉండాలనే సిద్ధాంతం పార్టీలో ఎక్కువైందని అంటూ సంచలన ఆరోణపలు చేశారు.
ప్రజా సమస్యలపై పోరాటంలో బీఆర్‌ఎస్ వెనకబడిందనీ, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే స్థితిలో అధినాయకత్వం ఉందని ఆరోపించారు. ఈ తరుణంలో తెలంగాణలో ప్రజలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ కనిపిస్తోందని బాలరాజు అభిప్రాయపడ్డారు.తెలంగాణలో ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ మార్గం అవసరమైందని బాలరాజు భావిస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని, అయితే ముందుగానే బీజేపీ వైపు నడవడం మంచిదని ఒక ఫోన్ సంభాషణలో చెప్పారు కూడా.
గువ్వల బాలరాజు రాజకీయ జీవితం
గువ్వల బాలరాజు 2007 అక్టోబర్ 6న బీఆర్ఎస్‌లో చేరి పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశారు. 2009లో నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2014, 2018లో అచ్చంపేట (ఎస్సీ) నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2022 నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత కొంతకాలంగా తన నియోజకవర్గానికి దూరంగా ఉన్న బాలరాజు, అనూహ్యంగా బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో సార్వత్రిక చర్చనీయంగా మారింది. బీజేపీ నేతల భరోసా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.