మహిళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

Published : Mar 28, 2023, 12:33 PM ISTUpdated : Mar 28, 2023, 12:37 PM IST
మహిళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

సారాంశం

Women’s Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు డిమాండ్ చేస్తూ పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాగా, ఇదివ‌ర‌కు బీఆర్ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత దేశ‌రాధాని లోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ ఒక రోజు నిరాహార దీక్ష‌కు సైతం కూర్చున్నారు.  

BRS move adjournment motion in Parliament: మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎంపీలు మంగ‌ళ‌వారం నాడు పార్లమెంటులో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వాయిదా తీర్మానంలో ఎంపీలు కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కవిత మాలోత్ మంగళవారం పార్లమెంటులో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వాయిదా తీర్మానంలో ఎంపీలు కోరారు.

కాగా, ఇదివ‌ర‌కు బీఆర్ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత దేశ‌రాధాని లోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ ఒక రోజు నిరాహార దీక్ష‌కు సైతం కూర్చున్నారు. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో 15కు పైగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ నిర‌స‌న‌లో పాల్గొన్నాయి.

మహిళా రిజర్వేషన్ బిల్లు డిమాండ్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలోని భారత్ జాగృతి త్వరలో మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ను ప్రారంభించనుంది. ప్రచారంతో పాటు, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాల్సిన ఆవశ్యకతపై చర్చించడానికి భారతదేశం అంతటా కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో రౌండ్ టేబుల్ చర్చలు కూడా జరుగుతాయ‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లు అవశ్యకతను గుర్తు చేస్తూ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. మహిళ రిజర్వేష్ బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే