కుమరం భీమ్ జిల్లాలో పెదవాగుపై కుంగిన బ్రిడ్జి: మూడు మండలాలకు నిలిచిన రాకపోకలు

By narsimha lode  |  First Published Aug 14, 2022, 11:06 AM IST


కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని పెదవాగుపై ఉన్న బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో ఈ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. ఈ బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 


కాగజ్ నగర్ :కుమరం భీమ్ జిల్లాలోని పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జి కుంగిపోయింది. కాగజ్ నగర్ మండలం అందవెల్లి వద్ద పెదవాగుపై ఉన్న బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో ఈ బ్రిడ్జిపై వాహనాలతో పాటు పాదచారులను కూడా అనుమతించడం లేదు.   బ్రిడ్జికి ఇరు వైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.  కుమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్దవాగుకు వరద పోటెత్తింది. పెద్దవాగుపై నిర్మించిన బ్రిడ్జి కుంగిపోయింది. ఈ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో  మూడు మండలాలకు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. పెదవాగు వరద ఉధృతికి ఈ బ్రిడ్జి కుంగిపోయిందని అధికారులు చెబుతున్నారు.ఈ బ్రిడ్జి ఏ క్షణమైనా కుప్పకూలిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో  పలు జిల్లాల ప్రజల జీవన వ్యవస్థను అతలాకుతలంచేస్తున్నాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. గత మాసంలో కురిసిన వర్షాల కారణంగా  పలు వాగులు, వంకలు, ప్రాజెక్టులకు వరద పోటెత్తింది.  కడెం ప్రాజెక్టుకు గత మాసంలో వరద పోటెత్తిన సమయంలో ఈ ప్రాజెక్టు తెగిపోతుందనే భయం కూడా వ్యక్తం అయింది. ఈ ప్రాజెక్టు కింద ఉన్న 25 గ్రామాల ప్రజలను రాత్రికి రాత్రే  ఖాళీ చేయించారు.  

Latest Videos

click me!