పెళ్లి పీటలపై వధువు.. వరుడు జంప్.. పోలీసుల ముందుకు పంచాయితి

Published : Jan 07, 2022, 06:45 PM IST
పెళ్లి పీటలపై వధువు.. వరుడు జంప్.. పోలీసుల ముందుకు పంచాయితి

సారాంశం

భద్రాద్రి కొత్తగూడెంలో ఓ పెళ్లి నిలిచిపోయింది. పెళ్లి ముహూర్తం మరికొద్ది సేపట్లో ఉండగా.. పెళ్లి కొడుకు ఉడాయించాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా.. రకరకాల కారణాలు చెబుతూ కాలాన్ని గడిపి చివరకు పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేశాడు. దీంతో ఆ వధువు పెళ్లి పీటలపైనే కన్నీరుమున్నీరైంది. పెళ్లి బట్టలతోనే ఆమె చర్ల పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.  

హైదరాబాద్: పెళ్లి(Marriage)కి ఘనంగా ఏర్పాట్లు చేశారు. పెళ్లి పీటలపైకి వధువు(Bride) వచ్చి కూర్చుంది. కానీ, పెళ్లి కొడుకూ ఇంకా రాలేదు. కొంత సేపు ఎదురుచూశారు. కానీ, పెళ్లి ముహూర్తం దగ్గరపడింది. అయినా వరుడు(Bridegroom) రాకపోవడంతో బంధువులు, పెళ్లికి వచ్చిన అతిథుల్లోనూ కలవరం మొదలైంది. కొన్ని సినిమాల్లోని పెళ్లి సీన్లు గుర్తుకు వచ్చాయి. వరుడు జంప్ అయి వుంటాడేమో అనే గుసగుసలు మొదలయ్యాయి. అదే నిజమైంది. పెళ్లి కొడుకుకు ఫోన్ చేస్తే ఇప్పుడు.. అప్పుడు.. అంటూ కాలాన్ని గడిపాడు. చివరకు పెళ్లి చేసుకోనని చెప్పి కనిపించకుండా పోయాడు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం పెళ్లి జరగాల్సి ఉన్నది. పెళ్లి మండపానికి వధువు వచ్చి కూర్చుంది. కానీ, వరుడు ఎంతకీ రాలేదు. పెళ్లి ముహూర్తం సమీపించడంతో పెళ్లి కొడుకు ఫోన్లు చేశారు. వరుడు రకరకాల కారణాలు చెబుతూ కాలం గడిపాడు. తీరా సమయం ముంచుకు వచ్చిన తర్వాత అనుమానంతో ఫోన్ చేయగా.. చివరకు పెళ్లి చేసుకోనని చెప్పేశాడు. దీంతో ఆ పెళ్లి కూతురు తీవ్ర ఆవేదనకు గురైంది. అంతేనా.. ఈ పంచాయితి పోలీసు స్టేషన్‌కు చేరింది. ఆ పెళ్లి కూతురు పెళ్లి బట్టలతోనే చర్ల పోలీసులను ఆశ్రయించి కన్నీటి పర్యంతమైంది.

ఈ నెల ఆంధ్రప్రదేశ్‌లో పెళ్లి పేరుతో ఓ యువతిన పోలీస్ కానిస్టేబుల్ మోసం చేశాడు. వార్డు సచివాలయంలో పనిచేస్తున్న యువతితో పరిచయం పెంచుకుని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరచ్చుకున్నాడు. అయితే యువతి గర్భం దాల్చడంతో.. గర్భ స్రావం చేయించాడు. యువతి పెళ్లి చేసుకోవాలని కోరగా.. ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో (visakhapatnam) చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. బాధిత యువతి (29) నగరంలో వార్డు సచివాలయ కార్యదర్శిగా పని చేస్తుంది. ఆమెకు మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నిమ్మకాయల నరేష్‌తో 2021 ఫిబ్రవరి నెలలో పరిచయం ఏర్పడింది. 

ఆ తర్వాత ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. వాట్సాప్‌లో చాటింగ్ చేసుకునేవారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరిగింది.  యువతిని ఇష్టపడుతున్నానని చెప్పిన కానిస్టేబుల్ నరేష్.. పెళ్లి చేసుకుంటానని కూడా తెలిపాడు. ఇందుకు ఆమె కూడా ఒకే చెప్పింది. ఈ పరిచయంతోనే కానిస్టేబుల్ వద్ద తన ల్యాప్‌టాప్ ఉంచి డబ్బులు తీసుకుంది. ఆ తర్వాత అవి చెల్లించడానికి నరేష్ ఉంటున్న పోలీస్ క్వార్టర్స్‌కు వెళ్లింది. అక్కడ నరేష్ ఆమెను శారీరకంగా లోబరుచుకున్నారు. 

అనంతరం పలుమార్లు రుషికొండ, పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి శారీరకంగా దగ్గరయ్యాడు. పలుమార్లు నరేష్‌కు లైంగికంగా దగ్గర కావడంతో యువతి గర్భం దాల్చింది. అయితే ఈ విషయాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించిన నరేష్.. ఆమెకు మాత్రలు ఇచ్చి గర్భస్రావం అయ్యేలా చేశారు. ఇక, యువతి తనను పెళ్లి చేసుకోమని అడగటంతో.. నరేష్ మోహం చాటేశాడు.రేష్ పెళ్లికి నిరాకరించడంతో యువతి తనకు జరిగిన అన్యాయంపై పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu