
హైదరాబాద్ (hyderabad) జూబ్లీహిల్స్ (jubilee hills) ప్రిజం పబ్‌లో (prism pub) దారుణం జరిగింది. నందకిశోర్ (nanda kishore) అనే కస్టమర్‌పై బౌన్సర్లు విచక్షణారహితంగా దాడి చేశారు. మొత్తం ముగ్గురు బౌన్సర్లు సదరు కస్టమర్‌పై తమ ప్రతాపం చూపారు. బౌన్సర్లతో పాటు పబ్ యజమానులు కూడా కస్టమర్‌పై రెచ్చిపోయి దాడి చేశారు. కింద పడేసి చితకబాదారు. స్మోకింగ్ చేయొద్దని చెప్పినప్పటికీ నంద కిశోర్ స్మోక్ చేశాడన్న కారణంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు నంద కిశోర్. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.