బీఆర్ఎస్ లో టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేసిన బోథ్ ఎమ్మెల్యే బాపూరావు బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీలు మారుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు నేడు ఢిల్లీకి వెడుతున్నారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిసి, వారి సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
బీఆర్ఎస్ జాబితాలో ఈసారి బాపూరావుకు టికెట్ దక్కలేదు. దీంతో అసంతృప్తితో ఉన్న బాపూరావు పార్టీకి రాజీనామా చేశారు. కాగా, కాంగ్రెస్ లో చేరతారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే, తాజాగా ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.