మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ జైలు నుంచి విడుదల, ఘన స్వాగతం (వీడియో)

By SumaBala BukkaFirst Published Jan 8, 2022, 10:41 AM IST
Highlights

జైలు నుండి విడుదలైన బొడిగె శోభకు BJP activists ఇంటివద్ద దిష్టి తీసి ఘన స్వాగతం పలికారు. బొడిగె శోభను పరామర్శించడానికి బీజేపీ కార్యకర్తలు, నాయకులూ భారీగా ఇంటివద్దకు తరలివస్తున్నారు.

కరీంనగర్ జిల్లా : జాగరణ దీక్ష సందర్భంగా అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే Bodige Shobhaఎట్టకేలకు జైలు నుంచి release అయ్యారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజల కొరకు ఉద్యమం చేస్తున్న తనను అక్రమంగా అరెస్టు చేసిన TRS ప్రభుత్వానికి రాబోయే 2024 ఎలక్షన్ లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని ఆమె స్పష్టం చేశారు.

"

జైలు నుండి విడుదలైన బొడిగె శోభకు BJP activists ఇంటివద్ద దిష్టి తీసి ఘన స్వాగతం పలికారు. బొడిగె శోభను పరామర్శించడానికి బీజేపీ కార్యకర్తలు, నాయకులూ భారీగా ఇంటివద్దకు తరలివస్తున్నారు.

ఇదిలా ఉండగా, జనవరి 5న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఒక్క అరెస్ట్ తో ఆగకుండా మరికొందరు బిజెపి నాయకుల అరెస్ట్ కు కేసీఆర్ సర్కార్ సిద్దమైనట్లు ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. ఈ క్రమంలోనే తన తూటాల్లాంటి మాటలతో ప్రభుత్వంపైనే కాదు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ నాయకులపై విరుచుకుపడే మాజీ ఎమ్మెల్యే bodige shobhaను కూడా అరెస్ట్ చేసారు.

కాగా అరెస్ట్ ముందు బొడిగె శోభ ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కరీంనగర్ పట్టణంలోని శోభ ఇంటికి ఆమెను అరెస్ట్ చేయడానికి భారీగా పోలీసులు చేరకున్నారు. అయితే ఈ విషయం తెలిసి అనుచరులతో పాటు BJP నాయకులు, కార్యకర్తలు ఆమె ఇంటివద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

అయితే శోభను కలవడానికి పోలీసులు ప్రయత్నించగా ఆమె తలుపులు పెట్టుకుని లోపలే వున్నారు. దీంతో పోలీసులు ఇంటిబయటే కాస్సేపు ఎదురుచూసారు. ఎలాగోలా ఆమె తలుపు తీసేలా చేసి అరెస్ట్ చేసి తమతోపాటు తీసుకువెళ్లారు. ఈ అరెస్ట్ పై ఎమ్మెల్యే శోభ భర్త గాలన్న స్పందిస్తూ...  జాగరణ దీక్ష సమయంలో పోలీసులపై దాడికి పాల్పడినందుకు 333 సెక్షన్ కింద అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారన్నారు.  

జాగరణ దీక్షలో శోభ కేవలం పోలీసులతో వాగ్వాదానికి దిగిందని... దాడికి పాల్పలడలేదని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ కు తొత్తుగా వ్యవహరిస్తున్న కరీంనగర్ సిపి సత్యనారాయణ ఇలా అక్రమ అరెస్టులు చేస్తున్నారని గాలన్న ఆరోపించారు.

ఇదిలావుంటే ఇప్పటికే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ లోని తన కార్యాలయంలో జాగరణ దీక్షకు సిద్దమైన బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. తీవ్ర ఉద్రిక్తల మధ్య ఎంపీ కార్యాలయ తలుపులను గ్యాస్ కట్టర్లలో తొలగించి మరీ సంజయ్ ని అరెస్ట్ చేసారు. అంతేకాకుండా అక్కడే వున్న బిజెపి నాయకుల్లో కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగతావారిని చెదరగొట్టారు. కోవిడ్ నిబంధను పాటించడం లేదంటూ పోలీసులు సంజయ్ దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేసారు.

ఈ సమయంలో అక్కడే వున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శోభ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా దీక్షకు దిగితే ఇంత దారుణంగా వ్యవహరించడం ఏమిటంటూ పోలీసులను నిలదీసారు. పోలీసుల తీరును తప్పుబడుతూ ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

click me!