
హైదరాబాద్ పాతబస్తీ వరద సహాయక కార్యక్రమాల్లో అపశృతి చోటు చేసుకుంది. వరద బాధితులను బయటకి తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తూ బోటు నీట మునిగింది. దీంతో బోటులో వున్న ఆరుగురిని జీహెచ్ఎంసీ సిబ్బంది కాపాడారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు.
కాగా కాగా తెలంగాణలో వర్ష బీభత్సానికి దాదాపు 12 మంది మరణించగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునగగా.. పలు నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.
Also Read:కేటీఆర్ ని నిలదీసిన వరద ముంపు బాధితులు
రోడ్లు, పలు ప్రాంతాలు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. వీధుల్లోని కార్లు, ఆటోలు, బైక్‌లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేటు సంస్థలకు అక్టోబర్ 14,15.. రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సహాయక చర్యల నిమిత్తం ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సైతం రంగంలోకి దించింది. పురాతన ఇళ్లల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.