బ్రేకింగ్: కాప్రాలో భారీ పేలుడు: ఒకరి మృతి, 8 మందికి గాయాలు

Published : Jan 18, 2019, 08:04 AM ISTUpdated : Jan 18, 2019, 10:29 AM IST
బ్రేకింగ్: కాప్రాలో భారీ పేలుడు: ఒకరి మృతి, 8 మందికి గాయాలు

సారాంశం

సికింద్రాబాద్ కాప్రాలో భారీ పేలుడు సంభవించింది. తెల్లవారుజామున భారీ శబ్ధంతో పేలుడు జరిగింది. పేలుడు ధాటికి సమీపంలోని భారీ నిర్మాణాలు కూలిపోయాయి. సుమారు కిలోమీటరు దూరం వరకు ఉన్న ఇళ్లలోని అద్దాలు, కిటీకిలు పగిలిపోయాయి.

సికింద్రాబాద్ కాప్రాలో భారీ పేలుడు సంభవించింది.  మోహన్‌లాల్ అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలి ఒకరు మరణించగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మోహన్‌లాల్ స్థానికంగా గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ నిర్వహిస్తాడు. ఉదయం ఖాళీ సిలిండర్లలోకి గ్యాస్ నింపుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

పెద్ద శబ్ధంతో వరుసపెట్టి సిలిండర్లు పేలిపోయాయి. పేలుడు ధాటికి మోహన్‌లాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. సమీపంలోని నిర్మాణాలు కుప్పకూలాయి. సుమారు కిలోమీటర్ వరకు ఉన్న ఇళ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ