హైదరాబాద్ : మణికొండలో పేలుడు, ఒకరికి తీవ్రగాయాలు.. ఉలిక్కిపడ్డ జనం

Siva Kodati |  
Published : May 17, 2023, 05:08 PM ISTUpdated : May 17, 2023, 05:11 PM IST
హైదరాబాద్ : మణికొండలో పేలుడు, ఒకరికి తీవ్రగాయాలు.. ఉలిక్కిపడ్డ జనం

సారాంశం

హైదరాబాద్ మణికొండలోని లాలమ్మ గార్డెన్‌లో భారీ శబ్ధంతో పేలుడు చోటు చేసుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

హైదరాబాద్ మణికొండలో పేలుడు సంభవించింది. స్థానిక లాలమ్మ గార్డెన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు కావడంతో అతనిని ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు చోటు చేసుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అయితే కెమికల్ డబ్బాల వల్లే పేలుడు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

రూ. 1641 కోట్ల‌తో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం.. ఈ రెండు ప‌ట్ట‌ణాల మ‌ధ్య త‌గ్గ‌నున్న ప్ర‌యాణ స‌మ‌యం
Fertility: తెలంగాణ‌లో ప‌డిపోతున్న సంతానోత్ప‌త్తి.. ఫెర్టిలిటీ చికిత్సల్లో పారదర్శకత పెరగాల్సిందే