వరంగల్ రూరల్ జిల్లా, చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో నిద్రిస్తున్న యువకుడు రాత్రికి రాత్రే అదృశ్యం అయ్యాడు. ఉదయం లేచి చూసే సరికి పడుకున్న వ్యక్తి లేకపోవడం మంచం పక్కనే మిరపకాయలు,ముగ్గు, మనిషి బొమ్మ నిమ్మకాయల కనిపించడంతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

మాయమైన వ్యక్తి చీమల సతీష్ అని గ్రామస్తులు తెలిపారు. రాత్రి మంచం మీద పడుకుని ఉదయం లేచి చూసేసరికి మనిషి కనిపించలేదు. మంచంమీద ఉన్న సెల్ ఫోన్ అలాగే ఉంది, అతని బైక్ కనిపించడం లేదు. మంచం పక్కన చేతబడి ఆనవాళ్లు కనిపించడంతో స్థానికంతా కలకలం రేగింది.
ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. కొడుకు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సతీష్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చేతబడి చేసి సతీష్ ను ఏం చేశారోనని బంధువులు రోధిస్తున్నారు.
ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలోనూ గ్రామంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. కాగా అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. దీంతో ఎప్పుడు ఏ అనర్థం ముంచుకువస్తుందోనని గ్రామస్తులు బిక్కు బిక్కుమంటున్నారు. దీనిమీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.