వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ మెజార్టీ సాధిస్తుందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తానే ముఖ్యమంత్రి అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై మండిపడ్డారు. కామారెడ్డిలో ప్రోటోకాల్ రగడ కొన్నాళ్లుగా సాగుతున్నది. షబ్బీర్ అలీకి ఉన్నత హోదా ఇచ్చి.. శిలాఫలకంపైనా ఆయన పేరు చేర్చడంపై కాటిపల్లి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సాధిస్తుందని అన్నారు. అప్పుడు తానే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక.. తన గర్ల్‌ఫ్రెండ్‌కు క్యాబినెట్ హోదా ఇస్తానని అన్నారు. ఇలా ఇయ్యోచ్చా? ఇయ్యొచ్చు అనుకుంటే తాను కూడా తయారు చేసుకుంటానని పేర్కొన్నారు.
Also Read: మార్చి 15వ తేదీలోపు ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లు!
మీడియాకే డైరెక్ట్‌గా చెబుతున్నా.. అని పేర్కొన్న కాటిపల్లి గతంలో తాను 2023లో తాను ఎమ్మెల్యే అయితీరుతానని చెప్పానని, అలాగే అయ్యానని వివరించారు. ఇది నెరవేర్చుకున్నట్టే ఇప్పుడు మరో విషయం చెబుతున్నానని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సాధిస్తుందని, తానే ముఖ్యమంత్రి అని అన్నారు. 2028లో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని, రాకుంటే తాను ముఖం చూపించనని వివరించారు. ఇది తన ఓపెన్ చాలెంజ్ అని పేర్కొన్నారు.