వికారాబాద్ లో నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం: కేసీఆర్ కాన్వాయ్ ను అడ్డగించేందుకు బీజేపీ యత్నం

By narsimha lodeFirst Published Aug 16, 2022, 4:02 PM IST
Highlights

వికారాబాద్ లో పలు  అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వికారాబాద్ వచ్చిన సీఎం కేసీఆర్ కాన్వాయ్ ను  బీజేపీ కార్యకర్తలు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్త కలెక్టరేట్ ను ప్రారంభించారు. 

వికారాబాద్: వికారాబాద్ లో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. వికారాబాద్ జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీకి కూడా కేీసీఆర్ శంకుస్థాపన చేశారు. నూతన కలెక్టరేట్ కార్యాాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.కలెక్టర్ చాంబర్ కార్యాలయంలో సర్వమత ప్రార్ధనలు చేశారు.

వికారాబాద్ లో నూతనంగా నిర్మించిన  కలెక్టరేట్ భవనాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు ప్రారంభించారు.  కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కలెక్టరేట్ల భవనాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. వికారాబాద్ జిల్లా నూతనంగా ఏర్పాటైన జిల్లా దీంతో ఈ జిల్లాకు కొత్త భవనాన్ని నిర్మించారు. ఈ భవన నిర్మాణంతో పాటు కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీకి కూడా సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు టీఆర్ఎస్  జిల్లా కార్యాలయాన్ని  సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 

బీజేపీ కార్యకర్తల అరెస్ట్

వికారాబాద్ లో పలు కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్  కాన్వాయ్ ను  బీజేపీ కార్యకర్తలు అడ్డుకొన ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు..  వికారాబాద్ ఎస్పీ కార్యాలయం నుండి  వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ఇంటికి సీఎం వెళ్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు సీఎం కాన్వాయ్ ను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. కాన్వాయ్ ను అడ్డుకొనేందుకు యత్నించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

click me!