తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ఫోకస్ చేసింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అగ్రనేతలు రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసే విషయమై చర్చించనున్నారు.జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతల ఇళ్లలో అగ్రనేతలు బస చేశారు.
హైదరాబాద్: Telangana రాష్ట్రంలోని 119 అుసెంబ్లీ నియోజకవర్గాల్లో BJP అగ్రనేతలు ఇటీవల బస చేశారు. అయితే వచ్చే మూడు నెలల తర్వాత ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే నేతలు మరోసారి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక నేతలతో చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల నాటి వరకు ఈ అగ్ర నేతలే రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకొని బీజేపీ అగ్రనేతలు రెండు రోజుల ముందే Hyderabad కు చేరుకున్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు పర్యటించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై స్థానిక నేతలతో చర్చించారు. పార్టీని బలోపేతం చేసేందుకు సూచనలు, సలహాలిచ్చారు. మరో మూడు మాసాల తర్వాత ప్రస్తుతం రాష్టరంలో ఏ నియోజకవర్గాల్లో నేతలు పర్యటించారో అదే నియోజకవర్గాల్లో ఈ నేతలు మరోసారి పర్యటించనున్నారు. ఈ విషయమై పార్టీ నాయకత్వం ఆదేశాలు ఇచ్చిందని సమాచారం.
undefined
2023 ఎన్నికల వరకు కూడా ఈ నేతలే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే విషయమై దిశా నిర్ధేశం చేయనున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఒక్క జిల్లాలో పార్టీ అగ్రనేతలు రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆ జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై చర్చించనున్నారు. పార్టీ బలబలాలపై చర్చించనున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్ధేశం చేయనున్నారు.
Gujarat మోడల్ ను పోలిన తరహలోనే బీజేపీ నాయకత్వం తెలంగాణలో ప్రయోగాత్మకంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అగ్రనేతల బస ఏర్పాటు చేశారు. అయితే రెండు రోజులకే ఈ టూర్ పరిమితం కాకుండా వచ్చే ఎన్నికల వరకు ఈ పద్దతిని కొనసాగించే అవకాశం ఉంది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రత్యేకించి తెలంగాణపై తీర్మానం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తుంది.ఈ తరుణంలో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా తీర్మానం కూడా రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి Amit Shah రాజకీయ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.ఈ తీర్మాణంలో దేశ వ్యాప్తంగా పార్టీ పరిస్థితిని ప్రస్తావించారు. ఏయే రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో లేదో ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై బీజేపీ నేతలు చర్చించనున్నారు.
also read:బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు: రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టిన అమిత్ షా
తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాంపై కూడా తెలంగాణపై రూపొందించనున్న ప్రత్యేక తీర్మానంలో ప్రస్తావించనున్నారు. మరో వైపు ఇవాళ సాయంత్రం జరిగే సభ ద్వారా టీఆర్ఎస్ కు బీజేపీ సమాధానం చెప్పనుంది. కేసీఆర్ నిన్న మోడీకి సంధించిన ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కొంత కాలంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఈ మాటల యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరింది.