అంతు చిక్కని బీజేపీ  అధిష్టానం తీరు.. ఈటల, కోమటిరెడ్డిల దారేటు..? 

By Rajesh KarampooriFirst Published Jun 27, 2023, 4:31 AM IST
Highlights

TS BJP : బీజేపీ అధిష్టానం అసంతృప్తి నేతలను దిల్లీకి పిలిచి మాట్లాడుతుంది. అయితే.. దిల్లీ వెళ్లిన ఈటల, కోమటిరెడ్డిలకు మాత్రం హైకమాండ్ తీరు అర్థం కాక ఆగమగమవుతున్నట్లు  తెలుస్తోంది.

TS BJP : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ముందు బీజేపీకి ఎదురుదెబ్బ తగలనున్నది. కర్ణాటక ఫలితాల తరువాత.. తెలంగాణాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే బీజేపీ అసంతృప్తి   నేతలు  పక్క చూపులు చూస్తున్నారు. ఇదే సమయంలో నేతల మధ్య విభేదాలు తలెత్తడంతో బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో అసంతృప్తి నేతలను హాస్తినాకు పిలిచి ప్రత్యేకంగా మాట్లాడుతోంది. ఇప్పటికే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను  ఢిల్లీకి  పిలిచి సమస్యలపై ఆరా తీసింది. బీఆర్ఎస్ ఎదుర్కొనేందుకు బీజేపీ ప్రస్తుత వ్యూహాలు సరిపోవని తమ సమస్యలను హైకమాండ్ కు వివరించారు. అయితే హైకమాండ్ నుంచి సరైనా స్పందన రాకపోవడంతో నేతలు ఎటు తెల్చుకోలేకపోతున్నారు.   

కోల్డ్ వార్

Latest Videos

తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. ఎన్నికల ముందు  భారీ చేరికలు ఉంటాయని  భావించినా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అనుకున్న ప్లాన్ ఏవి ఫలించడం లేవు. ఈ తరుణంలో పార్టీ నుంచి బండి సంజయ్, ఈటల వంటి నేతలు విడిపోయారని ప్రచారం తీవ్రమవుతోంది. ప్రధానంగా బండి సంజయ్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఇప్పటికే తెలంగాణ బీజేపీ చీఫ్ ను మార్చాలని బీజేపీ అధిష్టానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పరిణామాలపైనా పలు నివేదికలిచ్చినా... బీజేపీ అధినాయకత్వం మాత్రం తెలంగాణ బీజేపీ చీఫ్ బండిని మాత్రం మార్చే యోచనలో లేదని తెలుస్తుంది. ఇలా హైకమాండ్ చర్యలు నచ్చని నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు సమాచారం.  

అధిష్టానంతో ఈటల, కోమటిరెడ్డి భేటీ

తెలంగాణలో నెలకొన్న ప్రస్తుతం పరిమాణాలను వివరిస్తూ.. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పై చర్యలు తీసుకోవాలని, తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ప్రస్తుత వ్యూహాలు సరిపోవని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కానీ.. బీజేపీ హైకమాండ్ మాత్రం అధికారం బీఆర్ఎస్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం. అలాగే కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పెరగడంతో  పార్టీ మారాలని ఈ నేతలకు వారి అనుచరుల నుంచి కూడా ఒత్తిళ్లు ఎక్కువయ్యాయంట. ఈ నేపథ్యంలోనే ఏదొకటి తేల్చుకుందామనే  ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దిల్లీలో బీజేపీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారని తెలుస్తోంది.  మరోవైపు.. ఢిల్లీ పెద్దలు కేటీఆర్ కు అపాయింట్మెంట్ ఇవ్వటం, లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కాకపోవటంపై పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు విమర్శలు గుప్పిస్తుంది. అంతర్గతం బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ 

అంతు చిక్కని అధిష్టానం తీరు 

తెలంగాణలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా  పర్యటించిన ఈటల, కోమటిరెడ్డి హస్తినాలోనే ఉండిపోయారు. అగ్రనేతలతో వీరిద్దరూ సమావేశమవుతున్నారు. అయినా పార్టీ అధిష్టానం నుంచి సరైన సమాధానం మాత్రం రావడం లేదని తెలుస్తోంది. పార్టీ మారాలని తమపైన ఒత్తిడి ఉందని చెప్పినా సీనియర్ నేతలు పట్టించుకోలేదని తెలుస్తోంది. అధిష్టానం తీరు అంతు చిక్కపోవడంతో ఈటల, కోమటిరెడ్డి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ తరుణం ఈ ఇద్దరు నేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది చర్చనీయంగా మారింది.  
 

click me!