ఖమ్మం జిల్లాలో తెలంగాణ బిజెపి నేత దారుణ హత్య

Published : Dec 26, 2020, 09:41 AM ISTUpdated : Dec 26, 2020, 09:58 AM IST
ఖమ్మం జిల్లాలో తెలంగాణ బిజెపి నేత దారుణ హత్య

సారాంశం

ఖమ్మం జిల్లాలో బిజెపి తెలంగాణ రాష్ట్ర నేత రామారావు దారుణ హత్యకు గురయ్యాడు. వైరా మండల కేంద్రంలో రామారావుపై దుండుగులు కత్తులతో దాడి చేశారు. రామారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఖమ్మం:  తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణమైన హత్య జరిగింది. ఖమ్మం జిల్లాలోని వైరా మండల కేంద్రంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకుడు నేలవెల్లి రామారావు హత్యకు గురయ్యాడు. 

రామారావుపై దుండగులు కత్తులతో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రామారావును ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శనివారం మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. 

ఆర్టీఐ ద్వారా రామారావు ఉద్యమం చేస్తుంటారు. ఆర్థిక లావాదేవీలే రామారావు హత్యకు కారణమని భావిస్తున్నారు. నిందితుడిని రాజేష్ గా పోలీసులు గుర్తించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Cold Free Winter: ఈసారి చలి లేనట్టే.. శీతాకాలంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఎందుకిలా?
PM Kisan 24th Installment: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు ఖాతాలోకి ఎప్పుడంటే?