ఎంఐఎం నేత కాల్పుల్లో గాయపడిన జమీర్ మృతి

By telugu teamFirst Published Dec 26, 2020, 9:29 AM IST
Highlights

ఎంఐఎం నేత షారూఖ్ అహ్మద్ జరిపిన కాల్పుల్లో గాయపడిన సయ్యద్ జమీర్ అనే వ్యక్తి మరణించాడు. జమీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ నెల 18వ తేీదీన ఆదిలాబాద్ లో కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్ రద్దయిన: ఎంఐఎం జిల్లా కమిటీ నేత షారూఖ్ అహ్మద్ కాల్పుల్లో గాయపడిన సయ్యద్ జమీర్ అనే వ్యక్తి మరణించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. ఆదిలాబాదులోని తాటికొండలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఆదిలాబాద్ జిల్లా కమిటిని పార్టీ అధినేత అసదుద్దీన్ రద్దు చేసిన విషయం తెలిసిందే. 

షారూఖ్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. షారూఖ్ కత్తి, తుపాకితో ఈ నెల 18వ తేదీన వీరంగం సృష్టించాడు. షారూఖ్ రెండు రౌండ్లు కాల్పులు జరపగా ఒకరి తలకు, మరొకరికి పొట్టలో గాయాలయ్యాయి. 

కాల్పులు జరిగిన షారూఖ్ ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. షారూఖ్ లైసెన్స్ ఉన్న గన్ తో కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. అతని నుంచి తుపాకీని, తల్వార్ ను స్వాధీనం చేసుకున్నారు. 

ఇరు కుటుంబాల మధ్య గల పాత గొడవల కారణంగానే షారూఖ్ కాల్పులు జరిపినట్లు గుర్తించారు. చాలా కాలంగా షారూఖ్, మోసిన్ ఒకే పార్టీలో ఉన్నారు. అయితే మోసిన్ కుటుంబం టీఆర్ఎస్ లో చేరడంతో వివాదం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 

పిల్లలు క్రికెట్ ఆడుతుండగా జరిగిన గొడవ కారణంగా షారూక్ కాల్పులకు తెగబడ్డాడు. షారూఖ్ అతి సమీపం నుంచి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఓ యువకుడు పారిపోతుంటే వెంట పడి కాల్పులు జరిపాడు.  

click me!