వందల కోట్లు ఖర్చు చేసి గెలిచారు: టీఆర్ఎస్‌పై బండి ఫైర్

Published : Mar 21, 2021, 03:37 PM ISTUpdated : Mar 21, 2021, 03:38 PM IST
వందల కోట్లు ఖర్చు చేసి గెలిచారు: టీఆర్ఎస్‌పై బండి ఫైర్

సారాంశం

 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమను ఓడించేందుకు సీఎం కేసీఆర్ వందల కోట్లు కుమ్మరించారని బీజేపీ తెలంగాణ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.  


హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమను ఓడించేందుకు సీఎం కేసీఆర్ వందల కోట్లు కుమ్మరించారని బీజేపీ తెలంగాణ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.ఆదివారం నాడు ఆయన హైద్రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోట్లాది రూపాయాలు అక్రమంగా సంపాదించి ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆయన మండిపడ్డారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీని అన్ని పార్టీలు పనిచేశాయని ఆయన ఆరోపించారు.కేసీఆర్ సర్కార్ కు బీజేపీ మరో అల్టిమేటం ఇవ్వనుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ సత్తా చూపుతామన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తమ కారణంగానే పీఆర్సీ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టనుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.టీఆర్ఎస్ విజయం తాత్కాలికమేనని ఆయన చెప్పారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ, కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?