అధికారులను డిమోషన్ చేయడం కేసీఆర్ అనాలోచిత నిర్ణయం: బండి సంజయ్

By narsimha lode  |  First Published Nov 21, 2022, 10:03 PM IST

అధికారులను డిమోషన్  చేయడాన్ని  కేసీఆర్  అనాలోచిత  నిర్ణయమని  బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ విమర్శించారు.


హైదరాబాద్: అధికారులను  డిమోషన్  చేయడం కేసీఆర్  అనాలోచిత  నిర్ణయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర  అధ్యక్షుడు  బండి సంజయ్ విమర్శించారు. ఇది  కేసీఆర్ తుగ్లక్  చర్యగా  ఆయన  పేర్కొన్నారు. 
ట్రాన్స్ కో,  జెన్  కో  సంస్థల్లో  ఏ  ఒక్క  ఉద్యోగికి  అన్యాయం జరిగినా తాము  ఊరుకోబోమని  కూడా  బండి  సంజయ్ తేల్చి  చెప్పారు. అధికారుల పోరాటానికి  తాము  అండగా  నిలుస్తామన్నారు.

రాష్ట్ర  ప్రభుత్వం  తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ  పోరాటాలు  నిర్వహిస్తుంది. వచ్చే  ఏడాదిలో  ఎన్నికలు  జరగనున్నాయి,  ఇప్పటి నుండే  అసెంబ్లీ  ఎన్నికల  వేడి  నెలకొంది.  ఈ  తరుణంలో  ఉద్యోగుల  అంశంపై  రాష్ట్ర  ప్రభుత్వం  తీరుపై  బండి సంజయ్  విమర్శలు  గుప్పించారు.  ప్రభుత్వం  తన  పద్దతిని  మార్చుకోవాలని  కోరారు. 

Latest Videos

బీజేపీ  రాష్ట్ర  అధ్యక్షుడిగా  బండి  సంజయ్  బాధ్యతలు  స్వీకరించిన  తర్వాత  దూకుడుగా  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  కేసీఆర్  సర్కార్ పై  బండి సంజయ్ ఒంటికాలిపై  విమర్శలు గుప్పిస్తున్నారు.  టీఆర్ఎస్  నేతలు  కూడా  బీజేపీపై  అదే  స్థాయిలో  కౌంటరిస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నికను  టీఆర్ఎస్,  బీజేపీ  చాలా  సీరియస్  గా  తీసుకున్నాయి. అయితే  ఈ  ఎన్నికలో  బీజేపీ  అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి  ఓటమి పాలయ్యాడు. ఈ  స్థానంలో  బీజేపీ  అభ్యర్ధి  విజయం  సాధిస్తే తెలంగాణ  రాజకీయ పరిస్థితుల్లో  మార్పులు  ఉండేవనే  అభిప్రాయాలను  ఆ పార్టీ  నేతలు  వ్యక్తం  చేస్తున్నారు. ఇతర పార్టీలకు  చెందిన  అసంతృప్త  నేతలను  తమ వైపునకు  తిప్పే  అవకాశం  లేకపోలేదు.
 

click me!