నిరుద్యోగుల ఆత్మహత్యకు కేసీఆరే కారణం: బండి సంజయ్ ఫైర్

By narsimha lodeFirst Published Jul 9, 2021, 12:56 PM IST
Highlights


నాగర్‌కర్నూల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కేంద్రీకరించారు. నాగర్ కర్నూల్ లో  పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. స్థానికంగా ఉన్న పార్టీ కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేఃశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై  సంజయ్ విమర్శలు గుప్పించారు.తమ ఉద్యమాల వల్లే కేసీఆర్ ఫామ్ హౌస్  నుండి బయటకు వచ్చారన్నారు.


నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యకు కేసీఆరే కారణమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.శుక్రవారంనాడు నాగర్‌కర్నూల్‌లో పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.  రాష్ట్రంలో అన్ని పార్టీలు  తమ పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. బీజేపీకి భయపడి కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చారని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులకు వేసిన రైతు బంధు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు బ్యాంకులు కట్ చేసుకుంటున్నాయన్నారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను  నెరవేర్చకపోతే వాటిని నెరవేర్చే వరకు వెంటపడుతామని  ఆయన హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ ఒక పార్లమెంట్ నియోజకవర్గాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి  తీసుకురావడం కోసం బీజేపీ నాయకత్వం ఇప్పటినుండే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బండి సంజయ్ త్వరలోనే పాదయాత్ర నిర్వహించనున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఎణ్నికలను పురస్కరించుకొని పాదయాత్ర చేయనున్నారు. 

click me!