
హైదరాబాద్: సీఎం పదవిని కాపాడుకొనేందుకు కేసీఆర్ యాగాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఆదివారం నాడు ఆయన సికింద్రాబాద్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కొడుకును సీఎం చేసేందుకు కేసీఆర్ పూ.జలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తానే నిజమైన హిందూవునని కేసీఆర్ చెబుతాడని ఆయన గుర్తు చేశారు. యాగాలు, పూజలు చేసినంత మాత్రాన నిజమైన హిందువు కాడని చెప్పారు.హిందూమతాన్ని చీల్చి ఎంఐఎంతో చేతులు కలుపుతారన్నారు. హిందూ దేవుళ్లను అవమానపర్చే పార్టీతో కేసీఆర్ పొత్తు పెట్టుకొన్నాడని ఆయన విమర్శించారు.
హిందూ దేవుళ్లను దేవతలను అవమానపర్చేవాళ్లను అడ్డుకొనేందుకు వచ్చేవారినే హిందూ సమాజం గుర్తించనుందని ఆయన చెప్పారు. స్వార్ధం కోసం కేసీఆర్ తాను హిందువుల్లో చాంపియన్ గా చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు.
కరీంగనర్ జిల్లాలో హిందూగాళ్లు బొందుగాళ్లు అని ప్రసంగించిన కేసీఆర్ కు ఆ జిల్లా ప్రజలు తగిన బుద్ది చెప్పారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ కేంద్రీకరించింది.ఈ ఎన్నికల్లో జీహెచ్ఎంసీపై బీజేపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించారు. జీహెచ్ఎంసీలో డివిజన్ల వారీగా ఆ పార్టీ నేతలు ప్రచారాన్ని ప్రారంభించారు.