నిజమైన భారతీయుడైతే క్షమాపణ చెప్పాలి: కేసీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్

Published : Feb 14, 2022, 05:20 PM IST
నిజమైన భారతీయుడైతే క్షమాపణ చెప్పాలి: కేసీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్

సారాంశం

సర్జికల్ స్ట్రైక్స్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  సోమవారం నాడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్:Surgical Strikesపై తప్పుడు ప్రచారం చేస్తున్న తెలంగాణ సీఎం KCR నిజమైన భారతీయుడైతే వెంటనే క్షమాపణ చెప్పాలని BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay డిమాండ్ చేశారు.సర్జికల్ స్ట్రైక్స్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటరిచ్చారు. సోమవారం నాడు హైద్రాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో ఎప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ జరిగినా కూడా కేసీఆర్ ను తీసుకెళ్లాలని తాను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను కోరుతానని బండి సంజయ్ చెప్పారు.

సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతుంటే చూస్తే గానీ కేసీఆర్ కు నమ్మకం కలగదేమో అని సంజయ్ సెటైర్లు వేశారు.తమపై దాడి జరిగిందని పాకిస్తాన్  కూడా ప్రకటించినా కేసీఆర్ నమ్మడా అని బండి సంజయ్ ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్స్ పై వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ను క్షమించొద్దన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు సైనికుల ఆత్మ స్త్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.కేసీఆర్ వ్యాఖ్యలపై దేశ భక్తులంతా బాధపడుతున్నారన్నారు.

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో  అవినీతి జరిగిందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాఫెల్  యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి అక్రమాలు జరగలేదని Supreme Court తీర్పు ఇచ్చిందని  బండి సంజయ్ గుర్తు చేశారు. Raffile యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని విమర్శలు చేస్తే సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం పాల్జేయడమేనన్నారు.

సర్టికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత దేశమంతా సంబరాలు జరుపుకొందని ఆయన గుర్తు చేశారు. జవాన్ల త్యాగాన్లను కించపరిచేలా మాట్లాడడం దేశ ద్రోహమే అవుతుందని బండి సంజయ్ చెప్పారు సైనికులను నమ్మరు, ప్రధాని మాటల్ని నమ్మరు, పాక్ అధికారులు చెప్పినా కూడా నమ్మరా అని బండి సంజయ్ కేసీఆర్ ను ప్రశ్నించారు.  సర్జికల్ స్ట్రైక్ జరగనే లేదని కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. కేసీఆర్ ఏ దేశానికి మద్దతుగా మాట్లాడుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.

నిన్న కేసీఆర్ మాట్లాడిన మాటలన్నీ అవాస్తవాలేనని సంజయ్ తెలిపారు.. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మీడియా సమావేశం వీడియో క్లిప్పింగ్ ను బండి సంజయ్ విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. అంతేకాదు ఇదే విషయమై పాకిస్తాన్ అధికారులు చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియోను సంజయ్  ఈ విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. దేశ భద్రత విషయంలో ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్చా అని బీజేపీ నేత ప్రశ్నించారు. 

ఇటీవల కాలంలో కేసీఆర్ కు టెన్‌జన్‌పథ్ నుండి వచ్చిన స్క్రిప్టులతో మాట్లాడుతున్నారని కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. గతంలో Sonia Gandhiని పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కేసీఆర్ అడిగితే ఆమె ఒప్పుకోలేదన్నారు. అయితే  ఇక ప్రగతి భవన్ నుండి నెక్ట్స్ కేసీఆర్ గాంధీ భవన్ కే పోతాడని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. 

UPA ప్రభుత్వంలో కేసీఆర్  కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పనితీరుపై స్వయంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ క్షమాపణలు చెప్పిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. గతంలో కేసీఆర్ ను సీబీఐ అధికారులు ఒక్క రోజు విచారించారన్నారు. ఈఎస్ఐ, సహారా కుంభకోణం విషయంలో CBI అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించారని బండి సంజయ్ చెప్పారు. కేసీఆర్ అత్యంత అవినీతి పరుడని సంజయ్ విమర్శలు గుప్పించారు. గతంలో ప్రధాని Narendra Modiని Gajwel సభలో అభినందించారని బండి సంజయ్ గుర్తు చేశారు.  

మోడీ నాయకత్వంలో దేశంలో అవినీతి రహిత పాలన సాగుతుందని కేసీఆర్ చెప్పారన్నారు. అంతేకాదు  గత ప్రభుత్వం కంటే మోడీ నాయకత్వంలో కేంద్రం రాష్ట్రాలకు పన్నుల్లో వాటాను పెంచిందన్నారు. గతంలో సీఎంగా పనిచేసినందున  సీఎంల బాధలు తెలిసే మోడీ పన్నుల వాటాను పెంచినందుకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారన్నారు. ఈ సభ వీడియోను కూడా బండి సంజయ్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు.  కేసీఆర్ గురించి మాజీ ఎమ్మెల్సీ Dileep kumar రాసిన పుస్తకాన్ని బండి సంజయ్ మీడియా ప్రతినిధులకు పంచారు.

విద్యుత్ సంస్కరణల విషయంలో కేసీఆర్ తెలంగాణ రైతులను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎక్కడ ఉందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ విషయమై కేంద్రం నుండి వచ్చిన గైడ్‌లైన్స్ ను బండి సంజయ్ మీడియాకు ఇచ్చారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలనే ఉద్దేశ్యం కేసీఆర్ ఉందని  ఆయన మాటలను బట్టి అర్ధమౌతోందన్నారు. రాష్రంలో విద్యుత్ చార్జీలను పెంచడానిక కేసీఆర్  సర్కార్ ప్రయత్నాలు చేస్తోందన్నారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu