ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తలసాని ఫైర్

Published : Feb 14, 2022, 03:47 PM ISTUpdated : Feb 14, 2022, 04:25 PM IST
ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తలసాని ఫైర్

సారాంశం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ రాస్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  సీరియస్ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై  కిషన్ రెడ్డి విమర్శలకు తలసాని కౌంటర్ ఇచ్చారు.  

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి Talasani Srinivas Yadav హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం నాడు  మీడియాతో మాట్లాడారు.  KCR పై కేంద్ర మంత్రి Kishan Reddy చేసిన వ్యాఖ్యలకు  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కౌంటరిచ్చారు.Hyderabad లో వరదలు వస్తే కేంద్ర మంత్రిగా ఉండి కేంద్రం నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.హైద్రాబాద్ లో కిషన్ రెడ్డిని తిరగనివ్వబోమని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.

సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రుల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి  లక్ష రూపాయాల అభివృద్ది కూడా చేయలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికే సికింద్రాబాద్ ప్రజలు కిషన్ రెడ్డిని ఎందుకు ఎన్నుకున్నామా అని తిట్టుకుంటున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్  చెప్పారు. BJP నేతలు చేతకాని దద్దమ్మలు అంటూ ఆయన మండిపడ్డారు.

బండిపోతే బండి ఇస్తానన్న బీజేపీ ఎంపీ ఒక్క రూపాయి ఇచ్చారా అని తలసాని ప్రశ్నించారు. యుద్ధం చేస్తానంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శక్తి ఎంత అని ఆయన ప్రశ్నించారు. సైన్యాన్ని కూడా రాజకీయాల్లో లాగడం దుర్మార్గమన్నారు.  రఫెల్  యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. అయితే దీనికి సమాధానం చెప్పలేదన్నారు. దీనికి సైన్యానికి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

మరో వైపు Surgical Strike కు సంబంధించిన  ఆధారాలు బయట పెట్టాలని కూడా కేసీఆర్ డిమాండ్ చేస్తే సైన్యాన్ని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. Pulwama సర్జికల్ స్ట్రైక్స్ ను రాజకీయంగా ఉపయోగించుకొంటుంది మీరని ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు.యూపీఏ సర్కార్ ఇచ్చిన ఐటీఐఆర్ ని Narendra Modi సర్కార్ వెనక్కి తీసుకొందని తలసాని శ్రీనివాస్ యాదవ్  మండిపడ్డారు.

 తమ ప్రభుత్వం ఏడున్నర ఏళ్లలో ఇంటింటికి తాగు నీరు, వ్యవసాయానికి సాగు నీరు అందిస్తున్నామన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఏ పనైనా చేసిందా అని ఆయన ప్రశ్నించారు. రోజుకు నాలుగైదు డ్రెస్ లు వేసుకొని ఫ్యాష్యన్ షో లు చేయడం తప్ప మోడీ ఏం చేశారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.జీవితకాలం పాటు హిందూస్తాన్, పాకిస్తాన్ అంటూ గొడవలు సృష్టించడమే బీజేపీ నేతలకు తెలిసిన విద్య అంటూ ఆయన ఫైరయ్యారు.

కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..?

సర్జికల్ స్ట్రైక్స్ పై ఆధారాలు కావాలని సీఎం కేసీఆర్ చేసిన డిమాండ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.అభినందన్ వర్ధమాన్ పరాక్రమం చాలదా…? బాలాకోట్ దాడి తరువాత 6నెలలు పాకిస్తాన్ తమ సొంత గడ్డపై ఫ్లై జోన్ నిషేధించిన విషయం తెలియదా....  ఇవి రుజువు కాదా…కేసీఆర్ కు అనుమానం ఉంటే.. నేరుగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నే రుజువులు కోరవచ్చని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత సాయుధ బలగాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవని ఖండిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?
KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu