అలా చేస్తే తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ. 80లకే: బండి సంజయ్

By narsimha lode  |  First Published May 22, 2022, 12:29 PM IST

రాష్ట్ర ప్రభుత్వం విధించే  పన్నులు తగ్గిస్తే లీటర్ పెట్రో ల్ ను రూ. 80కే ఇవ్వొచ్చని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఇవాళ ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించినట్టుగా వ్యాట్ పన్నును ఎత్తివేయాలని బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. 


కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు తగ్గిస్తే  లీటర్ పెట్రోల్ ను రూ. 80 కి, ఇవ్వొచ్చని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుBandi Sanjay చెప్పారు.

ఆదివారం నాడు Karimnagar  లో ఆయన మీడియాతో మాట్లాడారు.  Ukraine పై Russia సాగిస్తున్న మిలటరీ యాక్షన్ నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం  Diesel, petrol ధరలపై విధించిన పన్నులను తగ్గించిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులను తగ్గించిందన్నారు. Telanganaరాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోలియం ఉత్పత్తులపై విధించిన పన్నులను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్ పై లీటరుకు రూ. 30 పన్ను విధిస్తుందన్నారు.ఈ పన్నును తగ్గిస్తే లీటర్ పెట్రోల్ రూ. 80లకే దక్కుతుందని బండి సంజయ్ చెప్పారు.

Latest Videos

undefined

కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై VAT పన్నును ఎత్తివేయాలని బండి సంజయ్ కోరారు. రాష్ట్రానికి కేసీఆర్ ఏమీ చేయలేదన్నారు. ఇప్పుడే దేశానికి ఏం చేస్తాడని KCR  ను బండి సంజయ్ ప్రశ్నించారు. దేశంలో ఏదో చేస్తాడని కేసీఆర్ భ్రమలు కల్పిస్తున్నాడన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  సకాలంలో జీతాలు ఇవ్వకుండా పంజాబ్ రైతులకు సహాయం ఎందుకు అని బండి సంజయ్ ప్రశ్నించారు. గొప్పల కోసమే కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో డబ్బులు పంచుతున్నారని బండి సంజయ్ విమర్శించారు.తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని ఇతర రాష్ట్రాల్లో  ఖర్చు చేస్తున్నారన్నారు.  ముందు తెలంగాణ రైతులను ఆదుకోవాలని బండి సంజయ్ సూచించారు.

రాష్ట్రంలో ప్రజలకు సకాలంలో పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. కొండగట్టులో ప్రజలు చనిపోతే కేసీఆర్ కనీసం పరామర్శించలేదన్నారు. ఆర్టీసీ కార్మికులు చనిపోతే  పరామర్శించారా అని కూడా ఆయన అడిగారు. ఏం సంచలనం సృష్టిస్తారో కూడా ప్రజలకు చెప్పాలని ఆయన కేసీఆర్ ను డిమాండ్ చేశారు. అక్రమాస్తులను కాపాడుకొనేందుకే కేటీఆర్ విదేశాలకు వెళ్లారని బండి సంజయ్ ఆరోపించారు. 

click me!