హైద్రాబాద్ నగర శివారులో ఘట్‌కేసర్‌లోని ఓ కాలేజీలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి.ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
హైదరాబాద్: నగర శివారులో ఘట్‌కేసర్‌లోని ఓ కాలేజీలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి.ఈ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ నేతలకు జేపీ నడ్డా దిశా నిర్ధేశం చేయనున్నారు.
సంఘ్ పరివార్ క్షేత్రాలు సహా బూత్ స్థాయి అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర పదాధికారుల సమావేశం హైద్రాబాద్ లో జరిగింది.ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఇవాళ తీర్మాణాలు చేయనున్నారు. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి కేంద్ర కేబినెట్ ట్రిబ్యునల్ ను ఆదేశించడం, నిజామాబాద్ లో పసుపు బోర్డు, ములుగులో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేయడంపై మోడీకి రాష్ట్ర కౌన్సిల్ సమావేశం తీర్మానం చేయనుంది.
undefined
తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఫోకస్ చేయనుంది. రానున్న రోజుల్లో బీజేపీ అగ్రనేతలు విస్తృతంగా పర్యటించనున్నారు. నిన్న బీజేపీ పదాధికారుల సమావేశానికి ఆ పార్టీ అగ్రనేత బీఎల్ సంతోష్ వచ్చారు. ఇవాళ జేపీ నడ్డా పార్టీ సమావేశానికి చేరుకున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ధీటుగా బీజేపీ రాజకీయ తీర్మానాలు చేసే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని 14 కమిటీలను బీజేపీ నిన్ననే ప్రకటించింది.తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీఈసీ నేతృత్వంలోని బృందం తెలంగాణలో మూడు రోజుల పాటు పర్యటించింది. ఈ నెల 6వ తేదీ తర్వాత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. దీంతో ఇవాళ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.