స్వామి పరిపూర్ణానంద హౌస్ అరెస్ట్‌: ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ లక్ష్మణ్

Published : Jul 09, 2018, 12:12 PM IST
స్వామి పరిపూర్ణానంద హౌస్ అరెస్ట్‌: ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ లక్ష్మణ్

సారాంశం

స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భేషరతుగా పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ నుండి విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


హైదదరాబాద్: స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేయడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు.భేషరతుగా పరిపూర్ణానంద హౌస్ అరెస్ట్ నుండి విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కత్తి మహేష్ శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం నాడు యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు పరిపూర్ణానంద స్వామి తలపెట్టారు. దీంతో ఈ యాత్రకు అనుమతిని నిరాకరిస్తూ ఆయనను హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ విషయమై  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్  రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చేయడం నిరసనలు చేయడం ప్రజల హక్కంటూ లక్ష్మణ్  చెప్పారు.

పరిపూర్ణానంద స్వామి హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హిందువులు, హిందువుల మనోభావాలను కించపర్చే విధంగా విమర్శలు గుప్పించిన వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు.. ఒక వర్గం వారిని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న వారి పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని  డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu