అర్హులైన బీసీలందరికి రుణాలు ఇవ్వాలి

First Published Jun 10, 2018, 3:48 PM IST
Highlights

బిజెపి ఓబిసి మోర్చా

అర్హులైన బీసీలందరికి ఋణాలు ఇవ్వాలని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వలబోజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈరోజు బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వలబోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వలబోజు శ్రీనివాస్ మాట్లాడుతు స్వయంఉపాధి క్రింద బీసీ కార్పొరేషన్ నుండి దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రుణాలు మంజూరు చేయాలని, అంతేగాక ఎదో తూతుమంత్రంగా సమావేశాలు నిర్వహించాలి కాబట్టి అని చెప్పి ఒకే కేంద్రంలో నాలుగు నుండి ఐదు డివిజన్ల లబ్ధిదారులను పిలిచి ధ్రువీకరణ పత్రాలు పరిశీలన అని చెప్పి వారిని భయబ్రాంతులకు, అయోమయానికి గురిచేస్తున్నారని, ఇవి కేవలం మొక్కుబడిలాగా క్రింది స్థాయి అధికారులను నియమించడం చూస్తుంటే ప్రభుత్వానికి బీసీలంటే ఎంత చిత్తశుది ఉందొ తెలుస్తుంది అని అన్నారు. లబ్ధిదారుల ఎంపికకు సరైన విధివిధానాలను ఇవ్వలేదని, అసలు అధికారులకు దాని పై ఎటువంటి అవగాహన లేదని ఆరోపించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం డివిజన్ల వారిగా ఒక నోడల్ అధికారిని నియమించి, ప్రతి డివిజన్ కు ఎంతెంత బడ్జెట్ కేటాయించారు అనే దానిని విడుదలచేసి లబ్ధిదారుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించిన వెంటనే ప్రకటించాలని, ఎంపికైన లబ్ధిదారులకు జులై ఆగస్టు నెల వరకు రుణాలు అందజేయాలని లేనిపక్షంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కార్పొరేషన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అదే విధంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బాకం హరిశంకర్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 2014 నుండి నేటి వరకు బీసీ కార్పొరేషన్ నుండి ఎంతెంత నిధులు ఇచ్చారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మందాటి వినోద్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగని జగదీశ్వర్, జిల్లా కార్యదర్శి గడల కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మేఘారాజ్ సుమన్ ఖత్రి, బీజేపీ నాయకులు సుధాకర్ పాల్గొన్నారు.

tags
click me!