: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న జేపీ నడ్డా తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న జేపీ నడ్డా తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం కుంభకర్ణుడి మాదిరిగా నిద్ర పోతుందన్నారు. స్పందన లేని రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తున్నామని ఆయన మండిపడ్డారు.కరోనా మేనేజ్ మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. కరోనాతో తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను మరువలేమన్నారు. దేశంలో అతి తక్కువ కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై గతంలో కూడ జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జేపీ నడ్డా విమర్శలపై అప్పట్లో తెలంగాణకు చెందిన మంత్రులు కూడ ఘాటుగానే స్పందించారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు సోమవారం నాటికి 80,751కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో 1256 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.రాష్ట్రం కరోనా కేసులను సెప్టెంబర్ చివరినాటికి నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖాధికారులు ప్రకటించారు.