మీ దాడులకు మేం భయపడం... ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మీ

By Siva KodatiFirst Published Nov 18, 2022, 2:20 PM IST
Highlights

బీజేపీ సీనియర్ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి ఘటనపై ఆయన తల్లి విజయలక్ష్మీ స్పందించారు. మీ దాడులకు తాము భయపడేది లేదని.. ఇంట్లో ఎవరూ లేనిది చూసి దాడి చేయడం తప్పని ఫైర్ అయ్యారు. 

బీజేపీ సీనియర్ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి ఘటన తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. దీనిపై టీఆర్ఎస్- బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే అర్వింద్, కల్వకుంట్ల కవితల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. తాగా ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మీ స్పందించారు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి దాడి చేయడం తప్పని.. విమర్శలు చేస్తే ఇంటిపై దాడులు చేస్తారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దాడులకు భయపడేది లేదని విజయ లక్ష్మీ పేర్కొన్నారు. 

అంతకుముందు తన ఇంటిపై దాడిపై ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. దమ్ముంటే తనపై వచ్చే ఎన్నికల్లో  పోటీ చేయాలని  కవితకు సవాల్  విసిరారు. ఇంకా దొరల పాలన సాగుతుందని  అనుకొంటున్నారా  అని  ఆయన ప్రశ్నించారు. హైద్రాబాద్ లోని తన ఇంటిపై టీఆర్ఎస్  శ్రేణులు దాడి చేసి  మహిళలను  భయపెట్టారని, తన తల్లిని బెదిరించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. నిజామాబాద్  పార్లమెంట్ లో పోటీచేస్తావా  చేయాలని  కవితకు అరవింద్ సవాల్ చేశారు. విమర్శలు చేస్తే దాడి చేస్తారా  అని  అర్వింద్ ప్రశ్నించారు

గత  పార్లమెంట్  ఎన్నికల సమయంలో  పోటీచేసిన 178 మందిలో 71 మంది పసుపు రైతులు బీజేపీలో చేరారన్నారు. తనపై చీటింగ్ కేసు  ఏం వేస్తావని  ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను  అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది టీఆర్ఎస్  అని అర్వింద్ విమర్శించారు. కేసీఆర్ పై చీటింగ్  కేసు  పెట్టాలని కవితకు  సలహా ఇచ్చారు  ఎంపీ అర్వింద్. రైతులు  గుంపులు గుంపులుగా  బీజేపీలో చేరుతున్నారన్నారు. 0 ఏళ్ల  వయస్సున్న తన తల్లిని   భయపెట్టే  హక్కు  ఎవరిచ్చారని  అరవింద్  ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALso REad:దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయ్, కుల అహంకారంతో దాడి: కవితపై నిజామాబాద్ ఎంపీ అరవింద్

కేసీఆర్, కేటీఆర్,  కవితకు  కుల  అహంకారం  ఉందన్నారు.  కుల  అహంకారంతోనే  ఇవాళ  తన  ఇంటిపై దాడికి  దిగారని అర్వింద్ విమర్శించారు.  కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో  మాట్లాడినట్టుగా  తనకు  ఎఐసీసీ  సెక్రటరీ  ఫోన్ చేసి చెప్పారన్నారు.  అదే విషయాన్ని  తాను  మీడియాలో  మాట్లాడినట్టుగా  అర్వింద్  తెలిపారు.  ఈ  వ్యాఖ్యల్లో  తప్పేం ఉందో  చెప్పాలన్నారు.  బీజేపీలో చేరాలని  కవితను  కూడా  అడిగినట్టుగా  కేసీఆర్  వ్యాఖ్యలు చేయలేదా  అని  అర్వింద్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ను  కూడా కొడతావా  అని  అర్వింద్ అడిగారు. ఇంతగా  రియాక్ట్  అవుతున్నారంటే  ఇందులో నిజముందని  అనుకొంటున్నానని అర్వింద్ తెలిపారు. కవితపై తాను  అనుచిత  వ్యాఖ్యలు  ఏం చేశానో  చెప్పాలని అర్వింద్  కోరారు.  కాంగ్రెస్  అధిష్టానానికి  చెందిన  కీలక  నేతలతో  కవిత  మాట్లాడిన  ఫోన్  కాల్ నిజమో  కాదో  తెలాల్సిన  అవసరం ఉందన్నారు.
 

click me!