Bandi Sanjay: "ప్రధాని ప్రకటనలతో బీఆర్ఎస్ నేతలకు పిచ్చెక్కుతోంది"

Published : Oct 04, 2023, 03:39 AM IST
Bandi Sanjay: "ప్రధాని ప్రకటనలతో  బీఆర్ఎస్ నేతలకు పిచ్చెక్కుతోంది"

సారాంశం

Bandi Sanjay: తెలంగాణలో ప్రధాని మోడీ రూ.20 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని  కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు. తెలంగాణ ప్రజలు దేశ ప్రధాని మోడీని ఎన్నటికీ మర్చిపోరని తెలిపారు. ప్రధాని నిధుల వరదజల్లుతో కల్వకుంట్ల కుటుంబానికి పిచ్చి లేస్తోందన్నారు. 

Bandi Sanjay: ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నిజామాబాద్ పర్యటనతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పర్యటనలో ప్రధాని మోడీ తాను ఎప్పుడు తెలంగాణ వచ్చినా సీఎం కేసీఆర్ తనకు స్వాగతం పలకపోవటానకి కారణం ఇదే అంటూ తెర వెనుక విషయాలను మోదీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇందూరు సభలో మోదీ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని, బీజేపీ అంటేనే.. బిగ్గెస్ట్ జుమ్లా పార్టీ అని అభివర్ణించారు.

ఈ తరుణంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తిప్పికొట్టారు. నిజామాబాద్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభ విజయవంతమైందని బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి తాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. 

తెలంగాణలో ప్రధాని మోడీ రూ.20 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని అన్నారు. తెలంగాణ ప్రజలు దేశ ప్రధాని మోడీని ఎన్నటికీ మర్చిపోరని తెలిపారు. ప్రధాని నిధుల వరదజల్లుతో కల్వకుంట్ల కుటుంబానికి పిచ్చి లేస్తోందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ టిల్లు అంటూ ఏద్దేవా చేశారు. కేటీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ నేతలు బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడని, పొలిటికల్ కామెంట్స్ చేయాలి గానీ.. అసభ్యంగా.. దుర్భాషాలాడుతూ వ్యక్తిగత ఆరోపణలు చేయొద్దని అన్నారు.  తెలంగాణ మొత్తం తన కుటుంబమని ప్రకటించిన సీఎం కేసీఆర్.. బీసీలను, దళితులను ఎందుకు సీఎం చేస్తాలేరని ప్రశ్నించారు. మంత్రి పదవులను ఇతర ఎమ్మెల్యేలకు ఇవ్వడం లేదని మండిపడ్డారు.

ప్రధాని మోదీని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. ఒకప్పుడూ.. కేటీఆర్  ముడతల షర్టు.. కలర్ పోయిన చెప్పులు వేసుకునే వాడనీ, నేడు లక్షల కోట్ల రూపాయాలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సోమ్మును దొచుకని.. కూడా పెట్టుకుంటున్నారని సంచలన కామెంట్స్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో సీఎం కేసీఆర్ డబ్బులు పంచింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. 

సీఎం కేసీఆర్ ను  చూస్తే.. తనకు నిజాం గుర్తుకు వస్తుండని అన్నారు.  తన ఆరోగ్యం బాగో లేదని, తన కుమారుడు (కేటీఆర్ )ను సీఎం చేస్తానని చెప్పింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. ఈ విషయమై.. తడి బట్టలతో సీఎం కేసీఆర్ నగరంలోని భాగ్యలక్ష్మి గుడికి రావాలని సవాల్ విసిరారు.

మంత్రి కేటీఆర్  భాషా చూసి తెలంగాణ సమాజం ఛీ కొడుతుందని అన్నారు. ఒక్కప్పుడూ కొత్త పాస్ పోర్టుల దందా చేసినా.. కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడివని ప్రశ్నించారు. గత 15 రోజుల నుంచి మంత్రి కేటీఆర్ పెట్టె ఇబ్బందులు భరించలేక సీఎం కేసీఆర్ బయటకు రావడం లేదన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కూడా కేసీఆర్ ను ఇబ్బంది పెడుతోందని, కేసీఆర్ తన బిడ్డ కొడుకు పోరును భరించలేకపోతున్నారని అన్నారు. 

ప్రధాని పర్యటనలతో బీఆర్ఎస్ నేతలు ఫ్రస్టేషన్,డిప్రెషన్ లోకి వెళ్లారని ఎద్దేవా చేశారు. అందుకే ప్రధాని మోడీపై హద్దు మీరి మాట్లాడుతున్నారనీ, అలాంటి మాటలు సరికావని అన్నారు. బీజేపీ గాంధీని పూజిస్తుందనీ, అనుసరిస్తుందని అన్నారు. మరీ గాంధీ జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. కే సీఆర్ ..గాడ్సే జయంతికి వెళ్తారా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అన్నారు. దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని ఇతర మైనార్టీ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారనీ, దూప దీప నైవేద్యం లేని దేవాలయాలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. వేములవాడ ఆలయం కోసం తాను మాట్లాడితే అధికారులను బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?