తెలంగాణ అసెంబ్లీ నుండి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను బుధవారం నాడు సస్పెండ్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుండి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను మంగళవారం నాడు సస్పెండ్ చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చేయకపోవడంతో ఈటల రాజేందర్ ను సభ నుండి సస్పెండ్ చేశారు.ఈ సెషన్ మొత్ం అసెంబ్లీ నుండి ఈటల రాజేందర్ ను స్పెండ్ చేశారు.
8వ అసెంబ్లీ సెషన్ లోని మూడో సమావేశాల నుండి ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభబ రోజున బీఏసీ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించలేదు.ఈ విషయమై అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఈటల రాజేందర్ ఈ నెల 6న మీడియాతో మాట్లాడారు. స్పీకర్ మరమనిషిగా నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.ఈ వ్యాఖ్యలను అధికార పార్టీ తప్పుబట్టింది. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను క్షమాపణ చెప్పాలని తెలంగాణ అసెంబ్లీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈటల రాజేందర్ ను డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ క్షమాపణలు చెప్పలేదు.
undefined
ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ఈటల రాజేందర్ హాజరయ్యారు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన రాలేదు. ఇవాళ అసెంబ్లీలో ఈటల రాజేందర్ ప్రసంగించే సమయంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని ప్రస్తావించారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్ క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కూడ వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.
క్షమాపణ చెప్పిన తర్వాతే సభా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు.ఈ వాదనను తెలంగాణ అసెంబ్లీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా సమర్ధించారు. గత సమావేఁశాల్లో కూడ ఇదే రకంగా సభలో రచ్చ చేసి సస్పెండ్ అయ్యారని ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. సభ వెలుపల రచ్చ చేసేందుకు ప్రయత్నించారని ఆయన విమర్శించారు. ఈటల రాజేందర్ చాలా సీనియర్ ఎమ్మెల్యే, అన్నీ తెలిసి కూడా ఆయన ఈ రకంగా వ్యవహరించడం సరికాదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. ఈటల రాజేందర్ సభలో ఉండి అన్నిఅంశాలపై చర్చలో పాల్గొనాలని తాము కోరుకుంటున్నామని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. పదే పదే చెప్పినా కూడా వినకపోతే తదుపరి చర్యలకు వెళ్లాల్సి ఉంటుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సభ మూడ్ ను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు సూచించారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడారు. తనకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తండ్రి లాంటివాడన్నారు. అయితే క్షమాపణ చెప్పకుండానే ఈటల రాజేందర్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. ఈ సభలో తాను 19 ఏళ్లుగా సభ్యుడగా ఉన్నానని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. తనకు సభలో మాట్లాడే అవకాశం ఉండదా అని ఆయన ప్రశ్నించారు. తనను బెదిరిస్తారా అని ప్రశ్నించారు. స్పీకర్ ను అవమానించే ప్రయత్నం చేయలేదని ఈటల రాజేందర్ చెప్పారు. ఈ సభ తమను ఉంచుకోవాలో, లేదా వెళ్లగొట్టాలనే మూడ్ లో ఉందో మీరే చెప్పాలని ఈటల రాజేందర్ కోరారు. మా హక్కులను కాపాడుతారో లేదో చెప్పాలని కూడా రాజేందర్ ప్రశ్నించారు. స్పీకర్ పై గౌరవం ఉందో లేదో మీరు ఎలా నిర్ణయిస్తారని అధికార పార్టీ సభ్యులను ఉద్దేశించి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేయాలని తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. పదే పదే ఈటల రాజేందర్ ను క్షమాపణ చెప్పాలని కోరినా కూడా పట్టించుకోనందున ఆయనను సభ నుండి సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది.
అసెంబ్లీ నుండి సస్పెన్షన్ కు గురైన ఈటల రాజేందర్ సభ నుండి బయటకు వచ్చారు.ఈ సమయంలో అసెంబ్లీ వద్ద పోలీసులకు, ఈటల రాజేందర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ టల రాజేందర్ ను పోలీసులు తమ వాహనంలో రాజేందర్ ను ఆయన ఇంటి వద్ద వదిలారు.