ఆ నలుగురు ఎమ్మెల్యేలు అణిముత్యాలు ఎలా అవుతారు?.. 8 ఏళ్ల పాలనపై చర్చకు కేసీఆర్ సిద్దమా?: ఈటల రాజేందర్ సవాలు

By Sumanth KanukulaFirst Published Nov 5, 2022, 12:59 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ 8 ఏళ్లలో టీఆర్ఎస్‌లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారో సమాధానం చెప్పాలన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ 8 ఏళ్లలో టీఆర్ఎస్‌లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. శనివారం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోళ్లలో కేసీఆర్ రారాజుగా మిగిలారని ఎద్దేవా చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనలోని ఆ నలుగురు ఎమ్మెల్యేలు అణిముత్యాలు ఎలా అవుతారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

కేసీఆర్ 8 ఏళ్ల పాలనపై చర్చకు సిద్దమా అని సవాలు విసిరారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ ఆ మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. దళిత వ్యక్తి అయిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను అవమానించారని అన్నారు. ఉప ఎన్నికలో ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్‌కు ఓటు వేయకుంటే ఫలితాలు రావని హెచ్చరించడం దారుణమని అన్నారు. అయినప్పటికీ హుజూరాబాద్‌లో జరిగిందే... మునుగోడులో జరగబోతోందని ధీమా వ్యక్తం చేశారు. 

Latest Videos

తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ మంట గలిపారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. కేసీఆర్ అసలు రూపం తెలంగాణ ప్రజలకు అర్థమైందని కామెంట్ చేశారు. 

click me!