ఎన్ఆర్సీ వస్తుంది, టీఆర్ఎస్ సంగతి చూస్తాం: బిజెపి ఎంపీ బండి సంజయ్

By telugu teamFirst Published Jan 31, 2020, 3:24 PM IST
Highlights

టీఆర్ఎస్ పై బిజెపి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నార్సీ వస్తోంది... టీఆర్ఎస్ సంగతి చూస్తామని ఆయన హెచ్చరించారు కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారని ఆయన అన్నారు.

న్యూఢిల్లీ: బిజెపి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సిఏఏను వ్యతిరేకించడానికి టీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

సీఏఏను టీఅర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు సీఏఏను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బండి సంజయ్ విమర్శించారు. గోకుల్ చాట్, లుంబనీపార్కుల్లో బాంబులు పేల్చినవారికి భారత పౌరసత్వం ఇవ్వాలా అని ఆయన ప్రశ్నించారు 

సీఏఏను వ్యతిరేకించేవారు భవిష్యత్తు తరాల దృష్టిలో దేశద్రోహులుగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు ఎన్నార్సీ వస్తుంది... అప్పుడు టీఆర్ఎస్ సంగతి చూస్తామని ఆయన హెచ్చరించారు. 

తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు రాష్ట్రపతి ప్రసంగంలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో వివరించారని ఆయన చెప్పారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణలో సీఏం కేసీఆర్ మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని బండి సంజయ్ అన్నిారు. సీఏఏను వ్యతిరేకించేవారు దేశద్రోహులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు. భైంసా గటన చాలా చిన్నదని కేసీఆర్ అనడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. 

దేశంలో బిజెపిని మించిన సెక్యులర్ పార్టీ మరొకటి లేదని ఆయన అన్నారు. మైనారిటీలకు కేంద్ర పథకాలు అందకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా ఏపీ అసదుద్దీన్ ఓవైసీ జై భీమ్ నినాదం ఎత్తుకున్నాడని ఆయన అన్నారు.

click me!