బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన లక్ష్మణ్, రాజాసింగ్

sivanagaprasad kodati |  
Published : Nov 12, 2018, 01:33 PM IST
బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన లక్ష్మణ్, రాజాసింగ్

సారాంశం

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, గోషామహల్ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌లు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. 

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, గోషామహల్ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌లు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ముషీరాబాద్‌లోని విజయగణపతి ఆలయంలో ఉదయం 11 గంటలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం లక్ష్మణ్ పార్టీ నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా ఎంఆర్‌ఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు.

రాజాసింగ్ ధూల్‌పేటలోని ఆకాశ్‌పురి హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో బీ ఫారం తీసుకుని.. అబిడ్స్‌లోని మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని రాజాసింగ్‌ నామినేషన్ వేశారు.

PREV
click me!

Recommended Stories

Sathya sai: సత్యసాయి గ్రామానికి 50 ఏళ్లు.. ఐదు దశాబ్దాల సేవా ప్రయాణం
AI in Cancer Treatment: క్యాన్సర్ చికిత్సలో అధునాతన టెక్నాలజీ.. ఏఐతో మరింత కచ్చితత్వం