అయోధ్య విరాళాలపై వ్యాఖ్యలు: చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ దాడి

By Siva KodatiFirst Published Jan 31, 2021, 5:58 PM IST
Highlights

వరంగల్ జిల్లా హన్మకొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ నేతలు దాడికి దిగారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి  విరాళాల సేకరణపై వివాదం నెలకొంది. విరాళాల సేకరణపై ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు.

వరంగల్ జిల్లా హన్మకొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ నేతలు దాడికి దిగారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి  విరాళాల సేకరణపై వివాదం నెలకొంది.

విరాళాల సేకరణపై ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ధర్మారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఆయన ఇంటిపై గుడ్లు, టమోటాలు, రాళ్లు విసిరారు బీజేపీ కార్యకర్తలు.

Also Read:దొంగ బుక్కులతో రామయ్యకి చందాలు: బీజేపీపై చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలు

దీనితో పాటు ధర్మారెడ్డి ఇంట్లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కాగా, ఆదివారం చల్లా ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామున్ని బీజేపీ రాజకీయ స్వార్ధం కోసం వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.

రామున్ని రాజకీయంలోకి లాగి అపవిత్రం చేస్తున్నారని ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. అయోధ్య పేరుతో దొంగ బుక్కులు పట్టుకుని చందాలు వసూళ్లు చేస్తున్నారని చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు.

అయోధ్య విరాళాలు ఎక్కడికి పోతున్నాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పటేల్ విగ్రహానికి 2900 కోట్లు పెట్టిన మీరు అయోధ్యకు 11 కోట్లు పెట్టలేరా అని ధర్మారెడ్డి ఎద్దేవా చేశారు.

click me!