కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిపై బిజెపి నాయకుల దాడి....నిమ్స్‌కు తరలింపు

By Arun Kumar PFirst Published Dec 7, 2018, 11:20 AM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కల్వకుర్తి మహాకూటమి అభ్యర్థి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి పై బిజెపి నాయకులు దాడికి పాల్పడ్డారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కల్వకుర్తి మహాకూటమి అభ్యర్థి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి పై బిజెపి నాయకులు దాడికి పాల్పడ్డారు.

నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సరళిని పరిశిలించడానికి అమనగల్ మండలం జంగారెడ్డి పల్లి గ్రామానికి వెళ్లిన వంశీచంద్ రెడ్డిని బిజెపి నాయకులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా అతడిపై దాడికి పాల్పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని కాంగ్రెస్ నాయకులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స చేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. 

గ్రామంలోని ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్లి వంశీచంద్ ప్రచారం చేస్తున్నాడంటూ బిజెపి కార్యకర్తలు ఆరోపిస్తూ అతన్ని అడ్డుకోడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్,, బిజెపి నాయకుల  మధ్య తోపులాట జరిగడంతో వంశీచంద్ రెడ్డి కిందపడిపోయారు. ఆయన కారుపై కూడా కొందరు రాళ్లు విసరడంతో ద్వంసమైపోయింది. 

ఓటమి భయంతోనే తమ అభ్యర్థులపై బిజెపి, టీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడుతున్నారని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ ఆరోపించారు. పోలీసులు, ఈసి అధికారులు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. తమ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

అయితే ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని బిజెపి నాయకులు చెబుతున్నారు. సంఘటనా స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు. 

వీడియో

click me!