అత్త ముక్కు కొరికిన కోడలు..!

Published : Dec 29, 2020, 08:33 AM IST
అత్త ముక్కు కొరికిన కోడలు..!

సారాంశం

ఇప్పుడు మొత్తం మారిపోయింది. కోడళ్లే.. అత్తలను వేధిస్తున్నారు. తాజాగా.. ఓ కోడలు.. ఏకంగా అత్తగారి ముక్కు కొరికేసింది.

ఒకప్పుడు.. అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు అనగానే.. అత్తగారి ఆరళ్లు భరించక తప్పదు అనుకునేవారు. ఆ కాలం అత్తలు కూడా అలానే ప్రవర్తించేవారు. కోడళ్లకు నరకం చూపించేవారు. కానీ.. ఇప్పుడు మొత్తం మారిపోయింది. కోడళ్లే.. అత్తలను వేధిస్తున్నారు. తాజాగా.. ఓ కోడలు.. ఏకంగా అత్తగారి ముక్కు కొరికేసింది. ఈ సంఘటన అలంపూర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మంగలి వీధిలోని శారదమ్మ, జయ్యన్న దంపతు లకు ప్రసాద్, భాస్కర్, శేఖర్‌ సంతానం. పెద్ద కొడుకు ప్రసాద్‌ కర్నూలులోని అత్తగారి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అన్నదమ్ముల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమ వారం ఉదయం మరోసారి గొడవ పడ్డారు. దీంతో చిన్న కుమారుడు శేఖర్‌ భార్య రేవతి ఆగ్రహంతో అత్త శారదమ్మ ముక్కు కొరికింది. తీవ్రరక్తస్రావం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా, వైద్యులు.. ముక్కుకు ఏడు కుట్లు వేశారు.
 

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్