ఈ గెలుపు టీఆర్ఎస్‌దా.. పీవీదా, నైతిక విజయం నాదే: రామచంద్రరావు

By Siva KodatiFirst Published Mar 20, 2021, 8:39 PM IST
Highlights

గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి గత మూడు నెలల నుంచి జరిగిన ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలు, ఉద్యోగులు, మేధావుల్ని ఏ రకంగా నిర్లక్ష్యం చేశారన్న దానిపై ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశామని చెప్పారు మాజీ ఎమ్మెల్సీ , బీజేపీ నేత రామచంద్రరావు

గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి గత మూడు నెలల నుంచి జరిగిన ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలు, ఉద్యోగులు, మేధావుల్ని ఏ రకంగా నిర్లక్ష్యం చేశారన్న దానిపై ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశామని చెప్పారు మాజీ ఎమ్మెల్సీ , బీజేపీ నేత రామచంద్రరావు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వున్నారని దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రుజువైందని చెప్పారు.

ఈ రెండు ఎన్నికల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా రామచంద్రరావు అభివర్ణించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తే ... దానిని ఇంకా కొనసాగిస్తారనే భయంతో టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేల్ని బరిలోకి దింపి గెలిచిందని ఆయన ఆరోపించారు.

Also Read:ఎమ్మెల్సీగా గెలిచిన వాణీదేవి.. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీజేపీ

24 నుంచి 25 శాతం ఓట్లు మాత్రమే వాణీదేవికి వచ్చాయని.. హైదరాబాద్‌తో పాటు నల్గొండలోనూ 75 శాతం మంది గ్రాడ్యుయేట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని రామచంద్రరావు వెల్లడించారు.

టీఆర్ఎస్ టెక్నికల్‌గా గెలిచానా.. బీజేపీ విజయాలను అడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిందని.. నైతిక విజయం తనదేనని రామచంద్రరావు స్పష్టం చేశారు.

ఈ గెలుపు టీఆర్ఎస్‌దా లేక పీవీ నరసింహారావుదా అని ఆయన ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరించారని రామచంద్రరావు ఆరోపించారు.

ఎన్నికల్లో సామాన్యుడు పోటీ చేయాలన్న అది కలగానే మిగిలిపోతుందని.. డబ్బు ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని ఆయన మండిపడ్డారు. ఇంటింటికీ వెళ్లి, కవర్ల‌లో పెట్టి మరి డబ్బు పంచారని రామచంద్రరావు ఆరోపించారు. 

click me!