ఎన్నికల కోడ్ ఉల్లంఘించింది: టీఆర్ఎస్‌పై బీజేపీ నేత రామచందర్ రావు ఫైర్

Published : Mar 22, 2021, 02:10 PM IST
ఎన్నికల కోడ్ ఉల్లంఘించింది: టీఆర్ఎస్‌పై  బీజేపీ నేత రామచందర్ రావు  ఫైర్

సారాంశం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కోడ్ ను ఉల్లంఘించిందని బీజేపీ నేత రామచందర్ రావు విమర్శించారు.  

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కోడ్ ను ఉల్లంఘించిందని బీజేపీ నేత రామచందర్ రావు విమర్శించారు.

సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. పీఆర్సీ విషయంలో లీక్ ఇచ్చి ఉద్యోగులను ప్రలోభపెట్టిందని ఆయన ఆరోపించారు.

టీఆర్ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందన్నారు.ఈ ఎన్నికల్లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్ఎష్ విపరీతంగా డబ్బులను పంచిందని ఆయన ఆరోపించారు. దొంగ సర్టిఫికెట్లతో ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయించారన్నారు.

హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుండి  బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యాడు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఆయన మరోసారి బరిలోకి దిగాడు. కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు మాత్రం ఈ దఫా నిరాశే మిగిలింది.బీజేపీకి చెందిన రామచందర్ రావుపై  టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణీదేవి విజయం సాధించారు.


 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్