దుబ్బాక బైపోల్: బీజేపీ ఆధిక్యంపై రామ్‌ మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Nov 10, 2020, 10:20 AM IST
Highlights

 దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై మూడో రౌండ్  లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు ఆదిక్యత సాధించడంతో  బీజేపీ కీలక రామ్ మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై మూడో రౌండ్  లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు ఆదిక్యత సాధించడంతో  బీజేపీ కీలక రామ్ మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ విషయంలో  మొదటి మూడు రౌండ్లలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగారు

An interesting fight in Telangana between BJP n TRS in Dubbaka Assembly by poll. BJP is currently leading. This could be a surprise victory for BJP

— Ram Madhav (@rammadhavbjp)

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీలో రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీన్ని చూస్తే బీజేపీ ఆశ్చర్యకరమైన విజయం సాధిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.బీజేపీ తెలంగాణ కార్యకర్తలు కష్టపడి పనిచేయడంతో బీజేపీ అభ్యర్ధి టీఆర్ఎస్ అభ్యర్ధి కంటే ముందంజలో ఉన్నారని ఆయన చెప్పారు.

 

 

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఈ నెల 3వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, బీజేపీ నుండి రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ నుండి చెరుకు శ్రీనివాస్ రెడ్డిలు పోటీలో ఉన్నారు.

ఈ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్ రావు పోటీ చేశారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు మూడోసారి.
 

click me!