నాగార్జునసాగర్: టికెట్ ఖరారు కాకుండానే బీజేపీ నేత నివేదిత నామినేషన్

By AN TeluguFirst Published Mar 26, 2021, 4:59 PM IST
Highlights

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం 8మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గతంలో బీజేపీ తరఫున పోటీ చేసిన నియోజకవర్త ఇంఛార్జ్ కంకనాల నివేదితా రెడ్డి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. 
 
ఇదిలా ఉంటే బీజేపీ అధిష్టానం అభ్యర్థిగా ఎవర్నీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పుటికీ నివేదిత నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. ఈ రోజు మంచిది కాబట్టి తాను నామినేషన్ వేశానని, నాయకత్వం తనకే టికెట్ ఇస్తుందనే నమ్మకం ఉందని నివేదిత అన్నారు. తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని కూడా చెప్పారు. 

నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెసు తరఫున కుందూరు జానారెడ్డి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. బీసీ నేతకు టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపు 300మంది కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్దంగా ఉన్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింత కృపాకర్ తెలిపారు. 

ఈ నెల 28లోపు తమ సమస్యలు పరిష్కరించకపోతే నామినేషన్లు వేస్తామని చెప్పారు. 10మంది ఫీల్డ్ అసిస్టెంట్లు నిడమనూరులోని ఆర్వో కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారు. 

click me!