టీఆర్ఎస్ పై అసంతృప్తి, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఫలించదు: బీజేపీ నేత మురళీధర్ రావు

By Nagaraju penumalaFirst Published May 7, 2019, 8:20 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను  బీజేపీ భర్తీ చేస్తోందని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలేమీ ఫలించవని స్పష్టం చేశారు. దేశంలో మోడీ మీద వ్యతిరేకత ఏమాత్రం లేదన్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

ఢిల్లీ: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని స్పష్టం చేశారు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు. టీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను  బీజేపీ భర్తీ చేస్తోందని తెలిపారు. 

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలేమీ ఫలించవని స్పష్టం చేశారు. దేశంలో మోడీ మీద వ్యతిరేకత ఏమాత్రం లేదన్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

బీజేపీయేతర కూటముల్లోని అసమ్మతి వాదులు తమకు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బీజేపీకి జరిగిన నష్టాన్ని తమిళనాడు రాష్ట్రంలో భర్తీ చేస్తామని మురళీధర్ రావు స్పష్టం చేశారు. అటు ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్డీఏ ద్వారాలు శాశ్వతంగా మూసివేశామని మురళీధర్ రావు స్పష్టం చేశారు. 

click me!