కరోనా : బీజేపీ నేత డా. లక్షణ్ సోదరుడి మృతి

Published : Feb 08, 2021, 11:37 AM IST
కరోనా : బీజేపీ నేత డా. లక్షణ్ సోదరుడి మృతి

సారాంశం

బీజేపీ నేత లక్ష్మణ్ ఇంట విషాదం నెలకొంది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ సోదరుడు కోవ శ్రీనివాస్ (61) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయనకు భార్య శోభ, ఇద్దరు కుమారులు నిఖిల్, కార్తీక్, కుమార్తె స్నేహ ఉన్నారు. 

శ్రీనివాస్ రెండు నెలల కిందట కోవిడ్ బారిన పడ్డారు. పాజిటివ్ వచ్చింది. ఆ తరువాత లంగ్స్ ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో హైదరాబాద్ లోని కిమ్స్ లో ఆయన్ని చేర్పించారు. అక్కడే ఆయనకు చికిత్స అందిస్తుంది. చికిత్స తీసుకుంటూ ఆదివారం ఆయన మృత్యవాత పడ్డారు. ఆయన అంత్యక్రియలు అంబర్ పేట హిందూ స్మశాన వాటికలో జరిగాయి. 

శ్రీనివాస్ అంత్యక్రియలకు ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణతో పాటు నాయకులు హాజరయ్యారు. శ్రీనివాస్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. 

సోదరుడు శ్రీనివాస్ మృతి పట్ల లక్ష్మణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. శ్రీనివాస్‌ మృతికి  హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ దత్తాత్రేయ సంతాపం ప్రకటించారు. 

అన్నా.. అంటే నేనున్నా అని పలికేవారు అంటూ డివిజన్‌ అధ్యక్షుడు రత్నసాయిచంద్‌ గుర్తుచేసుకున్నారు.  డా.లక్ష్మణ్‌ సోదరుడైన శ్రీనివాస్ అకాలమృతిపట్ల బీజేపీ నేతలు పలువురు సంతాపం ప్రకటించారు.

 గాంధీనగర్‌ తాజా కార్పొరేటర్‌ ఎ.పావనివినయ్‌కుమార్‌, నగర బీజేవైఎం అధ్యక్షుడు ఎ.వినయ్‌కుమార్ లు  శ్రీనివాస్ మరణం బాధాకరమన్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్