తెలుగు రాజకీయాలపై జయప్రద ఆసక్తి.... మనసులో మాట బయటపెట్టి..!

Published : May 31, 2022, 04:55 PM ISTUpdated : May 31, 2022, 04:57 PM IST
 తెలుగు రాజకీయాలపై జయప్రద ఆసక్తి.... మనసులో మాట బయటపెట్టి..!

సారాంశం

తమ పార్టీ అదిష్టానం ఆదేశిస్తే తాను ఆ దిశగా ముందుకు సాగుతానని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ జయప్రద పేర్కొన్నారు.

ప్రముఖ సినీ నటి జయప్రద.. తన మనసులో మాట బయటపెట్టారు. తనకు తెలుగు రాజకీయాల్లో పోటీ చేయాలని ఉందని ఆమె పేర్కొన్నారు. స్వతహాగా తెలుగు మహిళ అయిన తనకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని.. తమ పార్టీ అదిష్టానం ఆదేశిస్తే తాను ఆ దిశగా ముందుకు సాగుతానని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ జయప్రద పేర్కొన్నారు.

సోమవారం ఆమె హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని ఓ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ గెలుపునకు పాటుపడతానని చెప్పారు. తెలంగాణ, ఏపీలో అధికారంలో ఉన్న పార్టీలు పాలనను గాలికి వదిలేశాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించిన తర్వాతే దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆమె సూచించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు