నలుగురు తమ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఇంకా ప్రగతి భవన్ లోనే నిర్భంధించారని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు.టీఆర్ఎస్ మొత్తం బీజేపీలో విలీనం చేస్తామన్నా కూడా తాము విలీనం చేసుకొనేందుకు సిద్దంగా లేమన్నారు.
హైదరాబాద్:స్వంత ఎమ్మెల్యేలను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మాజీ ఎంపీ,బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. బుధవారంనాడు హైద్రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫాంహౌస్ ఘటనలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎందుకు ఇంకా ప్రగతి భవన్ లోనే నిర్భంధించారో చెప్పాలన్నారు. ఫాంహౌస్ ఘటనను సీబీఐ లేదా హైకోర్టు మాత్రమే విచారించాలని కోరారు.కవిత కాదు, టీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామన్న ఒప్పుకోమని బూర నర్సయ్యగౌడ్ చెప్పారు. కవిత ఎంపీగా ఓడిపోవడానికిటీఆర్ఎస్ అధిష్టానమే కారణమనేఆరోపణలున్నాయని బూర నర్సయ్య ౌడ్ ఆరోపించారు.
also read:ఎమ్మెల్సీ కవితను పార్టీ మారాలని అడిగారు:టీఆర్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ సంచలనం
ఈ నెల 15న హైద్రాబాద్ లో టీఆర్ఎస్ శాసనసభపక్షంతోపాటు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు కవితను కూడా పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారని చెప్పారు. ఇంతకన్న ఘోరం ఉంటుందా అన్నారు. పార్టీలు మారాలని బీజేపీ ఏ రకంగా ఒత్తిడి తెస్తుందో ఈ ఒక్క ఘటన రుజువు చేస్తుందన్నారు.బీజేపీ తీరుపై పోరాటం చేయాల్సిందేనని కేసీఆర్ తేల్చిచెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో సోదాలు చేసేందుకు వస్తే ధర్నాలు చేయాలని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం కావాలని కేసీఆర్ కోరారు.
మొయినాబాద్ ఫాంహౌస్ అంశంపై టీఆర్ఎస్ ,బీజేపీలు విమర్శలు చేసుకుంటున్నాయి. నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాల వెనుక బీజేపీ ప్రమేయం ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పింది. రామచంద్రభారతి,సింహయాజీ, నందకుమార్ లకు తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు ఇదివరకే స్పష్టం చేశారు.ఈ కేసును సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారించాలని బీజేపీ కోరుతుంది. ఈ కేసు విచారణక తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సీబీఐ విచారణకు తెంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు. సిట్ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ కేసులో సిట్ దూకుడుగా వెళ్తోంది. నాలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. కేరళ కేంద్రంగా నిందితులకు డబ్బులు అందాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.