క్యాసినో కేసులో వేగం పెంచిన ఈడీ.. విచారణకు హాజరైన తలసాని మహేష్, ధర్మేంద్ర

By Sumanth Kanukula  |  First Published Nov 16, 2022, 2:44 PM IST

క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి దర్యాప్తును మొదలుపెట్టింది. ఈ కేసుకు సంబంధించి తలసాని మహేష్‌, తలసాని ధర్మేందర్‌ యాదవ్‌‌లు నేడు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.


క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి దర్యాప్తును మొదలుపెట్టింది. ఈ కేసుకు సంబంధించి తలసాని మహేష్‌, తలసాని ధర్మేందర్‌ యాదవ్‌‌లు నేడు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. క్యాసినో, హవాలా కేసులో ఆరోపణలపై ఇరువురిని ఈడీ ప్రశ్నిస్తోంది. మనీలాండరింగ్ వ్యవహారంపైనా కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. గత కొంతకాలంగా  వీరు సాగించిన ఆర్థిక లావాదేవీలపై కూడా ఈడీ విచారణ జరుపుతుంది. ఇక, ఇప్పటికే ఈ కేసులో చికోటి ప్రవీణ్‌తో పాటు ఆయన  సన్నిహితులను ఈడీ పలుమార్లు విచారించిన సంగ తెలిసిందే. 

అంతకుముందు చికోటి ప్రవీణ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి విచారణకు హాజరుకావాలని నోటీసులు అందజేశారు. ఈ క్రమంలోనే ఈడీ విచారణకు హాజరైన చికోటి.. అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానమిచ్చినట్టుగా చెప్పారు. ఈ సందర్బంగా ఆయన పూర్తి విశ్వాసంతో కనిపించారు. 

Latest Videos

click me!