మరో మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసిన పోలీసులు (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 14, 2018, 2:51 PM IST
Highlights

తెలంగాణలో అసెంబ్లీ రద్దవడంతో అన్ని పార్టీలు ఎన్నికల కోసం సంసిద్దమయ్యాయి. అయితే ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీ నాయకులను గతంలోని పోలీస్ కేసులు ఇప్పుడు వెంటాడుతూ భయపెడుతున్నాయి. ఇప్పటికే సంగారెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మనుషుల అక్రమ రవాణా కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే రేవంత్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ లపై  కూడా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ కేసుల లిస్ట్ లో మరో మాజీ ఎమ్మెల్యే చేరిపోయారు.
 
బిజెపి పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు అబిడ్స్ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఆగస్టు 15వ తేదీన రాజాసింగ్ ఆద్వర్యంలో నగరంలో తిరంగ యాత్ర జరిగిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా ఆ యాత్ర నిర్వహించినందుకు అతడిపై నగరంలోని ఐదు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో బాగంగా తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆబిడ్స్ పోలీసులు రాజాసింగ్ కు నోటీసులు జారీ చేశారు. 

అయితే ఈ నోటీసులపై మాజీ ఎమ్మెల్యే రాజాసిగ్ స్పందించారు. దేశ భక్తి చాటేందుకు తిరంగ యాత్ర చేపట్టిన తనపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. మజ్లీస్ పార్టీ నాయకుల ఒత్తిడి వల్లే పోలీసులు ఈ కేసులు నమోదు చేశారుని అన్నారు. ఈ అక్రమ కేసులపై కోర్టులోనే తేల్చుకుంటానని రాజాసింగ్ స్పష్టం చేశారు.

అయితే ఇప్పటివరకు పలువరు కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదవగా తాజాగా బిజెపి నాయకుడికి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ప్రతిపక్షాలను దెబ్బతీయడానికే ఇలా పాత కేసుల్ని తిరగదోడున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. 

వీడియో

"

click me!