బండి సంజయ్ రాజీనామా: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకం

By narsimha lodeFirst Published Jul 4, 2023, 3:16 PM IST
Highlights

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా  కిషన్ రెడ్డిని నియమించింది  ఆ పార్టీ నాయకత్వం. 

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా  కిషన్ రెడ్డిని నియమించింది  ఆ పార్టీ నాయకత్వం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఉన్న  బండి సంజయ్ రాజీనామా చేయడంతో  కిషన్ రెడ్డిని  ఈ స్థానంలో  నియమించింది  ఆ పార్టీ.

ఈ ఏడాది  చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.  ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడిని ఆ పార్టీ నాయకత్వం  మార్చింది.  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఉన్న బండి సంజయ్ ను  మార్చాలని  ఈటల రాజేందర్ , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు  అమిత్ షా, జేపీ నడ్డాలను  కోరారు.  వచ్చే లోక్ సభ ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నాయకత్వ మార్పులకు  ఆ పార్టీ శ్రీకారం చుట్టింది.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి  పనిచేశారు.  తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టారు

Latest Videos

తెలంగాణ రాష్ట్రం నుండి   మోడీ కేబినెట్ లో కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు.  కిషన్ రెడ్డి మంత్రి పదవిని కొనసాగిస్తారా లేదా  అనేది రానున్న రోజుల్లో  తేలనుంది.  త్వరలోనే  కేంద్ర కేబినెట్ విస్తరణ  జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో కిషన్ రెడ్డిని తప్పిస్తారా లేదా అనేది తేలనుంది.  

also read:జేపీ నడ్డాతో బండి సంజయ్ భేటీ: తాజా రాజకీయాలు, సంస్థాగత వ్యవహారాలపై చర్చ

సౌమ్యుడిగా,  పార్టీలో అందరితో కలివిడిగా  ఉండే మనస్తత్వం  కిషన్ రెడ్డికి ఉంది. దీంతో  కిషన్ రెడ్డిని  బీజేపీ అధ్యక్ష పదవిని ఆ పార్టీ నాయకత్వం కట్టబెట్టింది. బండి సంజయ్ పార్టీలో అందరితో కలివిడిగా  లేరనే  ప్రచారం కూడ లేకపోలేదు.బండి సంజయ్ ను  పార్టీ అధ్యక్ష బాధ్యతల  నుండి తప్పించవద్దని  కొందరు నేతలు కోరుతున్నారు.  బండి సంజయ్ నాయకత్వాన్ని వ్యతిరేకించే  నేతలనుద్దేశించి  ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డి  ట్విట్టర్ లో ఇటీవల  చేసిన పోస్టు కలకలం రేపింది. బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి తప్పిస్తే  పార్టీలో  చేరికలుండవని మరో సీనియర్ నేత  విజయరామారావు చెప్పారు. 

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ను తప్పించింది రాష్ట్ర నాయకత్వం.  కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారా, పార్టీ పదవులు అప్పగిస్తారా అనే విషయమై  ఇంకా స్పష్టత రాలేదు.

click me!