బీజేపీ తొలి జాబితా:సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు, బరిలోకి ముగ్గురు ఎంపీలు

By narsimha lode  |  First Published Oct 22, 2023, 1:14 PM IST


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు  చోటు దక్కింది.  



హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను  బీజేపీ ఆదివారం నాడు విడుదల చేసింది.  ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు,  ముగ్గురు  సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 

2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ  నుండి నాలుగు పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే  ఇవాళ బీజేపీ విడుదల చేసిన జాబితాలో  బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి  ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు.ఈ ముగ్గురికి బీజేపీ మరోసారి టిక్కెట్లను కేటాయించింది.

Latest Videos

undefined

2018 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాజా సింగ్ ఒక్కరే  విజయం సాధించారు. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘునందన్ రావు  విజయం సాధించారు.హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా  బరిలోకి దిగిన ఈటల రాజేందర్ విజయం సాధించారు.   2022లో మహ్మద్ ప్రవక్తపై  అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ ఇవాళే ఎత్తివేసింది. తెలంగాణ అసెంబ్లీలో  ముగ్గురు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ టిక్కెట్టు కేటాయించింది.  

నలుగురు ఎంపీల్లో ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నిజామాబాద్ ఎంపీ  ధర్మపురి అరవింద్  కోరుట్ల అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగుతున్నారు.  కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్  కరీంనగర్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ  2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుండి ఎంపీగా పోటీ చేసి బండి సంజయ్ విజయం సాధించారు.ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు  బోథ్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నారు.

also read:52 మందితో బీజేపీ తొలి జాబితా: రెండు చోట్ల ఈటల పోటీ

ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడ  ఈ ఎన్నికలకు దూరంగా ఉంటారని సమాచారం.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం, పార్టీ ప్రచారంపై కేంద్రీకరించనున్నారు.

click me!