ఆలేరు హాస్టల్‌లో బాలిక అనుమానాస్పద మృతి

Published : Jan 04, 2019, 09:06 PM IST
ఆలేరు హాస్టల్‌లో బాలిక అనుమానాస్పద మృతి

సారాంశం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరులోని ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహించే హాస్టల్‌లో 14 ఏళ్ల బిందు అనే విద్యార్థిని శుక్రవారం నాడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది

ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరులోని ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహించే హాస్టల్‌లో 14 ఏళ్ల బిందు అనే విద్యార్థిని శుక్రవారం నాడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనతో విద్యార్థినులు భయాందోళనలు చెందుతున్నారు.

బిందు  ఉదయం పూట హాస్టల్‌లోనే కళ్లు తిరిగి చనిపోయిందని హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే కొంత కాలంగా  బిందు అనారోగ్యంగా ఉన్నా కూడ హాస్టల్ నిర్వాహకులు పట్టించుకోలేదని హాస్టల్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

బిందు మృతి విషయం తెలియడంతో ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకొన్నారు. బిందు మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం